LYRIC
Pallavi:
Aa navvulo yemunnado
chalinchindi na manasu tolisaarigaa
aa kallato yemannado
oke chuputo nannu mantrinchagaa
udayamlaa kanipinchindi hrudayamlo koluvayyindi
merupalle nanu taakindi varadalle nanu munchindi
avunannaa kaadannaa ayyedi ayyindigaa
chesedi yemundika….
Charanam:1
Nachacheppinaa ye okaruu nammare yela nannipudu nenee nenannaa//2//
munupu yennadu intidigaa murisipoledugaa
adupu tappenta alajadigaa ugipoledugaa
adugadugu alalavagaa parugulu nerpindi taane kadaa
avunannaa kaadannaa…..
Charanam:2
Gurtupattane ledasalu gunde lotulo gusagusalu tanochedaakaa//2//
teliyacheppindi tuntarigaa vayasu vachindani
talupu tattindi sandadigaa nidara yennaallani
tana chelime adagamani tarumuku vachindi tufaanugaa
avunannaa kaadannaa….
Telugu Transliteration
పల్లవి:ఆ నవ్వులో ఏమున్నదో
చలించింది నా మనసు తొలిసారిగా
ఆ కళ్ళతో ఏమన్నదో
ఒకే చూపుతో నన్ను మంత్రించగా
ఉదయంలా కనిపించింది హృదయంలో కొలువయ్యింది
మెరుపల్లే నను తాకింది వరదల్లే నను ముంచింది
అవునన్నా కాదన్నా అయ్యేది అయ్యిందిగా
చేసేది ఏముందిక....
చరణం:1
నచ్చచెప్పినా ఏ ఒకరూ నమ్మరు ఎలా నన్నిపుడు నేనే నేనన్నా(2)
మునుపు ఎన్నడూ ఇంతిదిగా మురిసిపోలేదుగా
అదుపు తప్పేంత అలజడిగా ఊగిపోలేదుగా
అడుగడుగు అలలవగా పరుగులు నేర్పింది తానే కదా
అవునన్నా కాదన్నా.....
చరణం:2
గుర్తుపట్టనే లేదసలు గుండె లోతులో గుసగుసలు తనొచ్చేదాకా(2)
తెలియచెప్పింది తుంటరిగా వయసు వచ్చిందని
తలుపు తట్టింది సందడిగా నిదర ఎన్నాళ్ళని
తన చెలిమే అడగమని తరుముకు వచ్చింది తుఫానుగా
అవునన్నా కాదన్నా....
Added by