LYRIC
Pallavi:
Nuvvu evvari edalo puvvula rutuvai eppudu vastavo
Ninu nammina jatalo navvulu chidimi enduku potavo
Teliyade evvariki ….telade ennatiki…..
Anduke ne kadhaki …. Antuledeppatiki….
Tiraluleve prema… Ne dariki
Charanam:1
Kalatale kovelai koluvaye vilayama…
Valapulo narakame varamane virahama….
Tapame dipama..vedane vedama….
Sapame divena nikide nyayama….
Kanniru abishekama nirasa naivedyama
Madilo mantale yagama….
Pranayama …… //nuvvu edalo//
Charanam:2
Reppale datade eppudu ekala….
Ningine takade kadalilo e ala..
Nelapai nilavade merupulo milamila
Kantila kanabade …. Branti i vennela….
Aranyala margama… Asatyala gamyama….
Nito payaname papama
Pranayama… //nuvvu edalo//
Telugu Transliteration
పల్లవి:నువు ఎవ్వరి ఎదలో పువ్వుల ఋతువై ఎప్పుడు వస్తావో
నిను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావో
తెలియదే ఎవ్వరికీ ....తేలదే ఎన్నటికీ.....
అందుకే నీ కధకీ .... అంతులేదెప్పటికీ....
తీరాలులేవే ప్రేమా... నీ దారికి
చరణం:1
కలతలే కోవెలై కొలువయే విలయమా...
వలపులో నరకమే వరమనే విరహమా....
తాపమే దీపమా..వేదనే వేదమా....
శాపమే దీవెనా నీకిదే న్యాయమా....
కన్నీరు అభిషేకమా నిరాశ నైవేద్యమా
మదిలో మంటలే యాగమా....
ప్రణయమా ......!!! ||నువ్వు ఎదలో||
చరణం:2
రెప్పలే దాటదే ఎప్పుడూ ఏకల....
నింగినే తాకదే కడలిలో ఏ అల..
నేలపై నిలవదే మెఋపులో మిలమిల
కాంతిలా కనబడే .... భ్రాంతి ఈ వెన్నెల....
అరణ్యాల మార్గమా... అసత్యాల గమ్యమా....
నీతో పయనమే పాపమా
ప్రణయమా... || నువ్వు ఎదలో||
Added by
Comments are off this post