LYRIC
Suraajyamavaleni svaraajyamendukani ..ee…ee..e..
Sukhaana manaleni vikaasamendukani
nijaanni balikore.. Samaajamendukani
adugutondi adigo egire bharata pataakam….
Aavesamlo pratinimisham urike nippula jalapaatam
kattikonala ee vartamaanamuna bratakadu saanti kapotam
bangaru bhavitaku punaadi kaagala yuvata prataapaalu..uu..uu..u
bhasmaasura hastaalai pragatiki samaadhi kadutunte
sirasuvanchenadigo egire bharata pataakam
cherugutondi aa talli charitalo visva vijayaala vibhavam
Suraajyamavaleni svaraajyamendukani
sukhaana manaleni vikaasamendukani
Kulamataala daavaanalaaniki karugutunnadi manchu sikharam
kalahamula haalaahalaaniki marugutunnadi hindu sandram
desamante matti kaadanu maata marachenu neti vilayam
amma bhaarati balini korina raachakurupee raajakeeyam
vishamu chimmenu jaati tanuvuna
ee vikrta gaayam
Telugu Transliteration
సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని ..ee...ee..e..సుఖాన మనలేని వికాసమెందుకని
నిజాన్ని బలికోరే.. సమాజమెందుకని
అడుగుతోంది అdiగో ఎగిరే భరత పతాకం....
ఆవేశంలో ప్రతినిమిషం ఉరికే నిప్పుల జలపాతం
కత్తికొనల ఈ వర్తమానమున బ్రతకదు శాంతి కపోతం
బంగరు భవితకు పునాది కాగల యువత ప్రతాపాలు..uu..uu..u
భస్మాసుర హస్తాలై ప్రగతికి సమాధి కడుతుంటే
శిరసువంచెనదిగో ఎగిరే భరత పతాకం
చెరుగుతోంది ఆ తల్లి చరితలో విశ్వ విజయాల విభవం
సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని
సుఖాన మనలేని వికాసమెందుకని
కులమతాల దావానలానికి కరుగుతున్నది మంచు శిఖరం
కలహముల హాలాహలానికి మరుగుతున్నది హిందు సంద్రం
దేశమంటే మట్టి కాదను మాట మరచెను నేటి విలయం
అమ్మ భారతి బలిని కోరిన రాచకురుపీ రాజకీయం
విషము చిమ్మెను జాతి తనువున
ఈ వికృత గాయం
Added by