రావు బహదూర్: ‘దేశ సంచారి’ పాటతో సత్యదేవ్ రెట్రో మ్యూజికల్ ట్రీట్

విలక్షణమైన పాత్రలు, అద్భుతమైన కథలతో ఆకట్టుకునే నటుడు సత్యదేవ్. ఆయన హీరోగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైకలాజికల్ డ్రామా ‘రావు బహదూర్’. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేయగా, జూలై 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ చిత్రం నుండి ‘దేశ సంచారి’ అనే రెండో పాటను విడుదల చేశారు. ఈ పాట పాతకాలం నాటి సంగీతానికి నివాళిగా రెట్రో-స్టైల్ రాక్ అండ్ రోల్ ట్యూన్‌లో సాగుతుంది. సాయి స్మరణ్ స్వరపరిచిన ఈ గీతాన్ని హేమచంద్ర, ప్రియాంక గజానన్ అద్భుతంగా ఆలపించారు.

ఈ పాట యొక్క ప్రత్యేకత దాని కొరియోగ్రఫీ. పంజరం లాంటి సెటప్‌లో సత్యదేవ్ స్టైలిష్ బాల్‌రూమ్ డ్యాన్స్ మూమెంట్స్‌తో అదరగొట్టారు. పాటలో ఆయన చూపించిన ఫ్లెక్సిబిలిటీ, ఎనర్జీ, మరియు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ మేజర్ హైలైట్‌గా నిలుస్తున్నాయి.

విజువల్‌గా ఈ సినిమా రెట్రో ఫిల్మ్‌మేకింగ్‌కు ఒక గ్రాండ్ ట్రిబ్యూట్‌లా కనిపిస్తోంది. అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, మరియు చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పిస్తున్నారు.

Added by

Telugu Lyrics

SHARE