అక్కినేని నాగార్జున విడుదల చేసిన `నరుడా..! డోన‌రుడా..!` ఆడియో

హీరో సుమంత్ కథానాయ‌కుడుగా రూపొందుతోన్న చిత్రం `నరుడా..! డోన‌రుడా..!`. అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో ర‌మా రీల్స్‌, ఎస్‌.ఎస్‌.క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌ పై సంయుక్తంగా ఈ చిత్రం రూపొందుతోంది.మ‌ల్లిక్‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని వై.సుప్రియ‌, సుధీర్ పూదోట నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమా పాట‌లు విడుద‌ల కార్య‌క్ర‌మం గురువారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఆడియో సీడీల‌ను అక్కినేని నాగార్జున విడుద‌ల చేయగా తొలి సీడీని అక్కినేని అఖిల్ అందుకున్నారు.  ఈ సంద‌ర్భంగా… మెసేజ్..ఎంటర్ టైన్మెంట్ ఉన్న సినిమా… […]