LYRIC
Pallavi:
Abbo emi vimta tolisaari kaugilimta
Ammo emitimta ollamtaa pulakarimta
Edo giligimta kaligene cemta
Cupula kavvimta repenu tullimta
Telimdi haayilona manasamtaa
Abbo emi vimta tolisaari kaugilimta
Ammo emitimta ollamtaa pulakarimta
Charanam:1
Gomtu caatu gumde paadani kottapaatalu
Mamtanaalu ceyyamannadi malletotalu
Onamaalu diddukunnavi oracupulu
Soyagaalu docukunnavi doranavvulu
Poddeponi saayamtramu muddekore ekaamtamu
Hadde miru shrumgaaramu vaddamtumdi vayyaaramu
Ika aagaleka rege yavvanamu..
Abbo emi vimta tolisaari kaugilimta
Ammo emitimta ollamtaa pulakarimta
Charanam:2
Maunamaina prema bhaashalo enni usulo
Raagamaina mugabaasalo enni aashalo
Sunnalaamti cinni movilo enni vannelo
Cinnadaani cilipi kallalo enni cinnelo
Uyyaaluge ullaasamu sayyaataade sallaapamu
Mogge vicce mamdaaramu sigge tecce simdhuramu
Valapamta niku naaku cerisagamu..
Abbo emi vimta tolisaari kaugilimta
Ammo emitimta ollamtaa pulakarimta
Edo giligimta kaligene cemta
Cupula kavvimta repenu tullimta
Telimdi haayilona manasamtaa
Abbo emi vimta tolisaari kaugilimta
Ammo emitimta ollamtaa pulakarimta
Telugu Transliteration
పల్లవి:అబ్బో ఏమి వింత తొలిసారి కౌగిలింత
అమ్మో ఏమిటింత ఒళ్ళంతా పులకరింత
ఏదో గిలిగింత కలిగేనే చెంత
చూపుల కవ్వింత రేపెను తుళ్ళింత
తేలింది హాయిలోన మనసంతా
అబ్బో ఏమి వింత తొలిసారి కౌగిలింత
అమ్మో ఏమిటింత ఒళ్ళంతా పులకరింత
చరణం:1
గొంతు చాటు గుండె పాడనీ కొత్తపాటలు
మంతనాలు చెయ్యమన్నది మల్లెతోటలు
ఓనమాలు దిద్దుకున్నవి ఓరచూపులు
సోయగాలు దోచుకున్నవి దోరనవ్వులు
పొద్దేపోని సాయంత్రము ముద్దేకోరే ఏకాంతము
హద్దే మీరు శృంగారము వద్దంటుంది వయ్యారము
ఇక ఆగలేక రేగె యవ్వనమూ..
అబ్బో ఏమి వింత తొలిసారి కౌగిలింత
అమ్మో ఏమిటింత ఒళ్ళంతా పులకరింత
చరణం:2
మౌనమైన ప్రేమ భాషలో ఎన్ని ఊసులో
రాగమైన మూగబాసలో ఎన్ని ఆశలో
సున్నలాంటి చిన్ని మోవిలో ఎన్ని వన్నెలో
చిన్నదాని చిలిపి కళ్ళలో ఎన్ని చిన్నెలో
ఉయ్యాలూగే ఉల్లాసము సయ్యాటాడే సల్లాపము
మొగ్గే విచ్చే మందారము సిగ్గే తెచ్చే సింధూరము
వలపంత నీకు నాకు చెరిసగమూ..
అబ్బో ఏమి వింత తొలిసారి కౌగిలింత
అమ్మో ఏమిటింత ఒళ్ళంతా పులకరింత
ఏదో గిలిగింత కలిగేనే చెంత
చూపుల కవ్వింత రేపెను తుళ్ళింత
తేలింది హాయిలోన మనసంతా
అబ్బో ఏమి వింత తొలిసారి కౌగిలింత
అమ్మో ఏమిటింత ఒళ్ళంతా పులకరింత