LYRIC
Pallavi:
Adilakshmi vanti attagarivamma //2//
sevalandi maku varamuliyavamma//2// //adi//
Charnam:1
Kalugune mi vanti sadhvi attaga maku
toli memu chesina punyamuna gaka
mandara malati parijatalato
andamuga mudivesi alarajesemu //adi//
Charanam:2
Manasu challaga kaga manchigandhamu pusi
ma muchatalu tirpa manavi cesemu
parani velayinchi padapujalu chese
korikalu tirunavi pongipoyemu //adi//
Telugu Transliteration
పల్లవి:ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మ “2”
సేవలంది మాకు వరములీయవమ్మ “2” “ఆది”
చరణం:1
కలుగునే మీ వంటి సాధ్వి అత్తగా మాకు
తొలి మేము చేసిన పుణ్యమున గాక
మందార మాలతీ పారిజాతాలతో
అందముగ ముడివేసి అలరజేసేము “ఆది”
చరణం:2
మనసు చల్లగ కాగ మంచిగంధము పూసి
మా ముచ్చటలు తీర్ప మనవి చేసేము
పారాణి వెలయించి పాదపూజలు చేసే
కోరికలు తీరునవి పొంగిపోయేము “ఆది”
Comments are off this post