LYRIC

Pallavi :
Anaganaga oka raju anaganaga oka rani
raju gunamu minna rani manasu venna //2//
anaganaga oka raju anaganaga oka rani

 

Caranam:1
a rajuku eduguru kodukulunnaru
varu caduvusamdhyalumdi kuda cavatalayyaru
oththi cavatalayyaru           //anaganaga//

 

Caranam:2
padakamida tummamullu paracenokkadu
ayyo imti dipamarpiveyu nemcekkadu
talli damdrulu vishamani talacenokkadu           //2//
paducu pellame bellamani bramasenokkadu… Bramasenokkadu…   //anaganaga//

 

Caranam3:
kodukulato patu raju kukkanu pemci
premayane paluposi pempucesenu       //2//
kamtipapakamte emto garavimcenu
danigumdelona gudukatti vumdasagenu tanumdasagenu  //anaganaga//

 

Caranam4:
nadi nadi anukunnadi nidi kadura
nivu rayannadi okanatiki ratnamaunura //2//
kurimigalavaramta kodukulenura          //2//
jaligumde leni kodukukanna kukkamelura… Kukkamelura

Anaganaga oka raju anaganaga oka rani
raju gunamu minna rani manasu venna
anaganaga oka raju anaganaga oka rani
kodukulato patu raju kukkanu pemci
premayane palu posi pempucesenu
konnallaku a raju kannumusenu
kukka callanaina cupuvalla illu nilicenu
na illu nilicenu

Telugu Transliteration

పల్లవి :

అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న // 2 //
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి


చరణం1 :

ఆ రాజుకు ఏడుగురు కొడుకులున్నారు
వారు చదువుసంధ్యలుండి కూడా చవటలయ్యారు
ఒఠ్ఠి చవటలయ్యారు // అనగనగా //


చరణం 2:

పడకమీద తుమ్మముళ్ళు పరచెనొక్కడు
అయ్యొ ఇంటి దీపమార్పివేయు నెంచెక్కడు
తల్లీ దండ్రులు విషమని తలచెనొక్కడు // 2 //
పడుచు పెళ్ళామే బెల్లమని భ్రమసెనొక్కడు... భ్రమసెనొక్కడు... // అనగనగా //


చరణం3:

కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచీ
ప్రేమయనే పాలుపోసి పెంపుచేసెను //2 //
కంటిపాపకంటె ఎంతో గారవించెను
దానిగుండెలోన గూడుకట్టి వుండసాగెను తానుండసాగెను // అనగనగా //


చరణం4:

నాది నాది అనుకున్నది నీది కాదురా
నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా
నాది నాది అనుకున్నది నీది కాదురా
నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా
కూరిమిగలవారంతా కొడుకులేనురా // 2 //
జాలిగుండె లేని కొడుకుకన్న కుక్కమేలురా... కుక్కమేలురా

అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి

Added by

Latha Velpula

SHARE

Comments are off this post