LYRIC
Ardha sataabdapu agnaanaanne .. Svatantramandaamaa
svarnotsavaalu cheddaamaa
aatma vinaasapu araachakaanne .. Svaraajyamandaamaa
daaniki salaamu cheddaamaa
Saantikapotapu kuttuka tenchi techchina bahumaanam
ee raktapu sindhooram
nee paapitalo bhaktigaa diddina prajalanu choodammaa
o pavitra bhaaratamaa
Ardha sataabdapu agnaanaanne .. Svatantramandaamaa
svarnotsavaalu cheddaamaa
nityam kottuku chachche janaala .. Svechchanu chooddaamaa
daanne svaraajyamandaamaa
Kulaala kosam gumpulu kadutoo
mataala kosam mantalu pedutoo
ekkadaleni teguvanu choopi taguvuku lestaare
janaalu talalarpistaare
samooha kshemam pattani svaardhapu
irukutanamlo muduchukupotoo
mottam desam tagaladutundani
nijam telusukorem .. Telisi bhujam kalipi raare
Alaanti janaala tarapuna evaro enduku poraadaalee
pori eviti saadhinchaalee
Evvari kosam evaru evarito .. Saaginche samaram
ee chichchula sindhooram
javaabu cheppe bhaadyata marachina .. Janaala bhaaratamaa
o anaadha bhaaratamaa
Ardha sataabdapu agnaanaanne .. Svatantramandaamaa
svarnotsavaalu cheddaamaa
aatma vinaasapu araachakaanne .. Svaraajyamandaamaa
daaniki salaamu cheddaamaa
Anyaayaanni sahinchani sauryam .. Daurjanyaanni dahinche dhairyam
kaaradavulalo kroora mrugamlaa .. Daakkuni undaalaa
veluguni tappuku tiragaalaa
satruvuto poraade sainyam .. Saantini kaapaade kartavyam
svajaati veerulananache vidhilo
kavaatu cheyyaalaa .. Annala chetilo chaavaalaa
Tanalo dhairyam adaviki ichchi
tana dharmam chattaaniki ichchi
aa kalaham choostoo .. Sangham silalaa niluchunte
nadiche savaala sigalo turimina nettuti mandaaram
ee sandhyaa sindhooram
vekuva vaipaa cheekatilokaa .. Etu nadipenammaa
gati tochani bhaaratamaa
Ardha sataabdapu agnaanaanne .. Svatantramandaamaa
svarnotsavaalu cheddaamaa
yuddha ninaadapu araachakaanne .. Svaraajyamandaamaa
daaniki salaamu cheddaamaa
Tana talaraatanu tane raayagala .. Avakaasaanne vadulukoni
tanalo bheetini tana avineetini .. Tana pratinidhuluga ennukoni
prajaasvaamyaanni talache jaatini prasninchadame maanukoni
kallu unna ee kabodi jaatini nadipistundata aavesam
aa hakkedo tanake undani .. Saasistundata adhikaaram
Krshnudu leni kurukshetramuna .. Saage ee ghoram
chiti mantala sindhooram
choostoo inkaa niduristaavaa .. Visaala bhaaratamaa
o vishaada bhaaratamaa
Ardha sataabdapu agnaanaanne .. Svatantramandaamaa
svarnotsavaalu cheddaamaa
aatma vinaasapu araachakaanne .. Svaraajyamandaamaa
daaniki salaamu cheddaamaa
Saantikapotapu kuttuka tenchi .. Techchina bahumaanam
ee raktapu sindhooram
nee paapitalo bhaktigaa diddina prajalanu choodammaa
o pavitra bhaaratamaa
Ardha sataabdapu agnaanaanne .. Svatantramandaamaa
svarnotsavaalu cheddaamaa
nityam kottuku chachche janaala .. Svechchanu chooddaamaa
daanne svaraajyamandaamaa
Telugu Transliteration
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే .. స్వతంత్రమందామాస్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మ వినాశపు అరాచకాన్నే .. స్వరాజ్యమందామా
దానికి సలాము చేద్దామా
శాంతికపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం
ఈ రక్తపు సింధూరం
నీ పాపిటలో భక్తిగా దిద్దిన ప్రజలను చూడమ్మా
ఓ పవిత్ర భారతమా
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే .. స్వతంత్రమందామా
స్వర్ణోత్సవాలు చేద్దామా
నిత్యం కొట్టుకు చచ్ఛే జనాల .. స్వేఛ్చను చూద్దామా
దాన్నే స్వరాజ్యమందామా
కులాల కోసం గుంపులు కడుతూ
మతాల కోసం మంటలు పెడుతూ
ఎక్కడలేని తెగువను చూపి తగువుకు లేస్తారే
జనాలు తలలర్పిస్తారే
సమూహ క్షేమం పట్టని స్వార్ధపు
ఇరుకుతనంలో ముడుచుకుపోతూ
మొత్తం దేశం తగలడుతుందని
నిజం తెలుసుకోరేం .. తెలిసి భుజం కలిపి రారే
అలాంటి జనాల తరపున ఎవరో ఎందుకు పోరాడాలీ
పోరి ఏవిటి సాధించాలీ
ఎవ్వరి కోసం ఎవరు ఎవరితో .. సాగించే సమరం
ఈ చిచ్ఛుల సింధూరం
జవాబు చెప్పే భాద్యత మరచిన .. జనాల భారతమా
ఓ అనాధ భారతమా
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే .. స్వతంత్రమందామా
స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మ వినాశపు అరాచకాన్నే .. స్వరాజ్యమందామా
దానికి సలాము చేద్దామా
అన్యాయాన్ని సహించని శౌర్యం .. దౌర్జన్యాన్ని దహించే ధైర్యం
కారడవులలో క్రూర మృగంలా .. దాక్కుని ఉండాలా
వెలుగుని తప్పుకు తిరగాలా
శత్రువుతో పోరాడే సైన్యం .. శాంతిని కాపాడే కర్తవ్యం
స్వజాతి వీరులణణచే విధిలో
కవాతు చెయ్యాలా .. అన్నల చేతిలొ చావాలా
తనలో ధైర్యం అడవికి ఇచ్చి
తన ధర్మం చట్టానికి ఇచ్చి
ఆ కలహం చూస్తూ .. సంఘం శిలలా నిలుచుంటే
నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుటి మందారం
ఈ సంధ్యా సింధూరం
వేకువ వైపా చీకటిలోకా .. ఎటు నడిపేనమ్మా
గతి తోచని భారతమా
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే .. స్వతంత్రమందామా
స్వర్ణోత్సవాలు చేద్దామా
యుద్ధ నినాదపు అరాచకాన్నే .. స్వరాజ్యమందామా
దానికి సలాము చేద్దామా
తన తలరాతను తనే రాయగల .. అవకాశాన్నే వదులుకొని
తనలో భీతిని తన అవినీతిని .. తన ప్రతినిధులుగ ఎన్నుకొని
ప్రజాస్వామ్యాన్ని తలచే జాతిని ప్రశ్నించడమే మానుకొని
కళ్ళు ఉన్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం
ఆ హక్కేదో తనకే ఉందని .. శాసిస్తుందట అధికారం
కృష్ణుడు లేని కురుక్షేత్రమున .. సాగే ఈ ఘోరం
చితి మంటల సింధూరం
చూస్తూ ఇంకా నిదురిస్తావా .. విశాల భారతమా
ఓ విషాద భారతమా
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే .. స్వతంత్రమందామా
స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మ వినాశపు అరాచకాన్నే .. స్వరాజ్యమందామా
దానికి సలాము చేద్దామా
శాంతికపోతపు కుత్తుక తెంచి .. తెచ్చిన బహుమానం

Added by