LYRIC

Aatmeeyata karuvainaa andhakaaram edurainaa
bratakadame baruvainaa sthitigatulavi evainaa

Pallavi :
chirunavvulato bratakaali .. Chiranjeevigaa bratakaali
chirunavvulato bratakaali .. Chiranjeevigaa bratakaali
chirunavvulato bratakaali .. Chiranjeevigaa bratakaali

Aanandaalanu anveshistoo .. Andarikosam bratakaali
andarinee bratikinchaali

Chirunavvulato bratakaali .. Chiranjeevigaa bratakaali

Charanam : 1
bratuke neeku baruvaite aa bhaaram dinchuko
baruvedainaa gurito o nalugurito panchuko
kalate leni jeevitamante viluve ledule
alupe leka avaleelagaa e gelupoo raadule
ninginante evarestainaa .. Nelanundi modalautundi
nammukoku adrshtaanni nammuko dhairyaanni
merupule pidugulai urumutunnaa
urakalu vese kiranam jeevitam
chirunavvulato bratakaali .. Chirudivvelugaa velagaali
chirunavvulato bratakaali .. Chirudivvelugaa velagaali
lokam nindina sokam tudiche .. Vekuvalaa udayinchaali
vennelane kuripinchaali

Chirunavvulato bratakaali .. Chiranjeevigaa bratakaali

Charanam : 2
edige pakshirekkaku sahajam egire lakshanam
vadilestundi ninnati gootini kadile aa kshanam
edee needi kaadani anuko edonaatiki
ayinaa repu migile undi aasaavaadiki
kommalannee chukkalavaipe korikori choostunnaa
mattitoti anubandhaanni .. Chettu maruvagaladaa
cheedale needalai veedakunnaa..aa
andari brmdaavaname jeevitam
chirunavvulato bratakaali .. Sreekaaramlaa bratakaali
chirunavvulato bratakaali .. Sreekaaramlaa bratakaali
gatamantaa kanumarugavutunnaa
ninnati svapnam nilavaali .. Nee sankalpam gelavaali

Chirunavvulato bratakaali .. Chiranjeevigaa bratakaali

Charanam : 3
aase ninnu nadipistundi aakaasaaniki
aase daari choopistundi avakaasaaniki
aase neeku lakshyam chere astram mitramaa
aase neeku aayuvu penche amrutam nestamaa
aasa venta aacharanunte .. Adbhutaalu nee sontam
aadamarachi niduristunte andade vasantam
nippule gundelo nindutunnaa
upponge jalapaatam jeevitam
chirunavvulato bratakaali .. Chiguraasalato bratakaali
chirunavvulato bratakaali .. Chiguraasalato bratakaali
antima vijayam anivaaryamani
aasistoo nuvu bratakaali .. Aasayaanni bratikinchaali

Chirunavvulato bratakaali .. Chiranjeevigaa bratakaali

Charanam : 4
neede ninnu bhayapedite aa neram velugudaa
naluse baadhapedutunte aa dosham kantidaa
nestam choodu jeevitamante nityam samarame
samaramlone kanumooste aa maranam amarame
paaripoku e otamikee prapanchaanni vidichi
jaaripoku paataalaaniki bratukubaata marachi
varadalaa mrtyuve tarumutunnaa .. Aa
aarani agnijvaale jeevitam
chirunavvulato bratakaali sikharamlaa pekaidagaali
chirunavvulato bratakaali sikharamlaa pekaidagaali
chaavuku choope aa teginputo
jeevinchaalanukovaali .. Nuvu jeevinche teeraali

Chirunavvulato bratakaali .. Chiranjeevigaa bratakaali

Charanam : 5
vijayam talupu terachevarakoo visuge chendaku
visuge chendi nisprhato nee venuke choodaku
chinde chematachukkaku saitam undee phalitame
adi andevaraku sahanamto .. Saagaali payaname
antaraatma gonte nulimi .. Saanti korukuntaavaa
allukunna anubandhaale tallidillipovaa
alajade niluvunaa alumukunnaa
aluperugani chaitanyam jeevitam

Chirunavvulato bratakaali .. Chiranjeevigaa bratakaali
chirunavvulato bratakaali .. Chiranjeevigaa bratakaali

Aanandaalanu anveshistoo .. Andarikosam bratakaali
andarinee bratikinchaali

Telugu Transliteration

ఆత్మీయత కరువైనా అంధకారం ఎదురైనా
బ్రతకడమే బరువైనా స్థితిగతులవి ఏవైనా

పల్లవి :
చిరునవ్వులతో బ్రతకాలి .. చిరంజీవిగా బ్రతకాలి
చిరునవ్వులతో బ్రతకాలి .. చిరంజీవిగా బ్రతకాలి
చిరునవ్వులతో బ్రతకాలి .. చిరంజీవిగా బ్రతకాలి

ఆనందాలను అన్వేషిస్తూ .. అందరికోసం బ్రతకాలి
అందరినీ బ్రతికించాలి

చిరునవ్వులతో బ్రతకాలి .. చిరంజీవిగా బ్రతకాలి

చరణం : 1
బ్రతుకే నీకు బరువైతే ఆ భారం దించుకో
బరువేదైనా గురితో ఓ నలుగురితో పంచుకో
కలతే లేని జీవితమంటే విలువే లేదులే
అలుపే లేక అవలీలగా ఏ గెలుపూ రాదులే
నింగినంటే ఎవరెస్టైనా .. నేలనుండి మొదలౌతుంది
నమ్ముకోకు అదృష్టాన్ని నమ్ముకో ధైర్యాన్ని
మెరుపులే పిడుగులై ఉరుముతున్నా
ఉరకలు వేసే కిరణం జీవితం
చిరునవ్వులతో బ్రతకాలి .. చిరుదివ్వెలుగా వెలగాలి
చిరునవ్వులతో బ్రతకాలి .. చిరుదివ్వెలుగా వెలగాలి
లోకం నిండిన శోకం తుడిచే .. వేకువలా ఉదయించాలి
వెన్నెలనే కురిపించాలి

చిరునవ్వులతో బ్రతకాలి .. చిరంజీవిగా బ్రతకాలి

చరణం : 2
ఎదిగే పక్షిరెక్కకు సహజం ఎగిరే లక్షణం
వదిలేస్తుంది నిన్నటి గూటిని కదిలే ఆ క్షణం
ఏదీ నీది కాదని అనుకో ఏదోనాటికి
అయినా రేపు మిగిలే ఉంది ఆశావాదికి
కొమ్మలన్నీ చుక్కలవైపే కోరికోరి చూస్తున్నా
మట్టితోటి అనుబంధాన్ని .. చెట్టు మరువగలదా
చీడలే నీడలై వీడకున్నా..ఆ
అందరి బృందావనమే జీవితం
చిరునవ్వులతో బ్రతకాలి .. శ్రీకారంలా బ్రతకాలి
చిరునవ్వులతో బ్రతకాలి .. శ్రీకారంలా బ్రతకాలి
గతమంతా కనుమరుగవుతున్నా
నిన్నటి స్వప్నం నిలవాలి .. నీ సంకల్పం గెలవాలి

చిరునవ్వులతో బ్రతకాలి .. చిరంజీవిగా బ్రతకాలి

చరణం : 3
ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి
ఆశే దారి చూపిస్తుంది అవకాశానికి
ఆశే నీకు లక్ష్యం చేరే అస్త్రం మిత్రమా
ఆశే నీకు ఆయువు పెంచే అమృతం నేస్తమా
ఆశ వెంట ఆచరణుంటే .. అద్భుతాలు నీ సొంతం
ఆదమరచి నిదురిస్తుంటే అందదే వసంతం
నిప్పులే గుండెలో నిండుతున్నా
ఉప్పొంగే జలపాతం జీవితం
చిరునవ్వులతో బ్రతకాలి .. చిగురాశలతో బ్రతకాలి
చిరునవ్వులతో బ్రతకాలి .. చిగురాశలతో బ్రతకాలి
అంతిమ విజయం అనివార్యమని
ఆశిస్తూ నువు బ్రతకాలి .. ఆశయాన్ని బ్రతికించాలి

చిరునవ్వులతో బ్రతకాలి .. చిరంజీవిగా బ్రతకాలి

చరణం : 4
నీడే నిన్ను భయపెడితే ఆ నేరం వెలుగుదా
నలుసే బాధపెడుతుంటే ఆ దోషం కంటిదా
నేస్తం చూడు జీవితమంటే నిత్యం సమరమే
సమరంలోనే కనుమూస్తే ఆ మరణం అమరమే
పారిపోకు ఏ ఓటమికీ ప్రపంచాన్ని విడిచి
జారిపోకు పాతాళానికి బ్రతుకుబాట మరచి
వరదలా మృత్యువే తరుముతున్నా .. ఆ
ఆరని అగ్నిజ్వాలే జీవితం
చిరునవ్వులతో బ్రతకాలి శిఖరంలా పెకైదగాలి
చిరునవ్వులతో బ్రతకాలి శిఖరంలా పెకైదగాలి
చావుకు చూపే ఆ తెగింపుతో
జీవించాలనుకోవాలి .. నువు జీవించే తీరాలి

చిరునవ్వులతో బ్రతకాలి .. చిరంజీవిగా బ్రతకాలి

చరణం : 5
విజయం తలుపు తెరచేవరకూ విసుగే చెందకు
విసుగే చెంది నిస్పృహతో నీ వెనుకే చూడకు
చిందే చెమటచుక్కకు సైతం ఉందీ ఫలితమే
అది అందేవరకు సహనంతో .. సాగాలి పయనమే
అంతరాత్మ గొంతే నులిమి .. శాంతి కోరుకుంటావా
అల్లుకున్న అనుబంధాలే తల్లిడిల్లిపోవా
అలజడే నిలువునా అలుముకున్నా
అలుపెరుగని చైతన్యం జీవితం

చిరునవ్వులతో బ్రతకాలి .. చిరంజీవిగా బ్రతకాలి
చిరునవ్వులతో బ్రతకాలి .. చిరంజీవిగా బ్రతకాలి

ఆనందాలను అన్వేషిస్తూ .. అందరికోసం బ్రతకాలి
అందరినీ బ్రతికించాలి

Added by

Meghamala K

SHARE

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x