LYRIC
Pallavi:
Abimanyudu : chupulu kalisina subavela
emduku niki kalavaramu
emduku niki kalavaramu
ullasamuga nenuhimcina amdame nilo cimdenunule //chupulu//
Charanam:1
Sasireka : chupulu kalisina subavela emduku niki paravasamu
emduku niki paravasamu
ekamtamlo anamdimcina na kalale nijamayenule //chupulu//
Charanam:2
Abimanyudu : alapanalu sallapamulu kalakala kokila gitamule… “alapamulu”
celuvamulanni citraracanale…”celuvamu”
calanamuloho natyamule //chupulu//
Charanam:3
sasireka : saramula valene caturoktulanu curukuga visire naijamule….
Saramu udyanamuna vira viharame…//udya//
celi kadanoho sauryamule…//cupulu//
Telugu Transliteration
పల్లవి:అభిమన్యూడు : చూపులు కలిసిన శుభవేళా
ఎందుకు నీకీ కలవరము ఎందుకు నీకీ కలవరము
ఉల్లాసముగా నేనూహించిన అందమె నీలో చిందెనునులే "చూపులు
చరణం:1
శశిరేఖ : చూపులు కలిసిన శుభవేళా ఎందుకు నీకీ పరవశము
ఎందుకు నీకీ పరవశము
ఏకాంతంలో ఆనందించిన నా కలలే నిజమాయెనులే "చూపులు"
చరణం:2
అభిమన్యూడు : ఆలాపనలు సల్లాపములు కలకల కోకిల గీతములే... "ఆలాపములు"
చెలువములన్నీ చిత్రరచనలే..."చెలువము"
చలనములోహో నాట్యములే "చూపులు"
చరణం:3
శశిరేఖ : శరముల వలెనే చతురోక్తులను చురుకుగ విసిరే నైజములే....
శరము ఉద్యానమున వీర విహారమే..."ఉద్యా"
చెలి కడనోహో శౌర్యములే..."చూపులు"