LYRIC
Pallavi:
Enduku chenthaki vasthaao.
Enduku cheyyodilesthaavo..
Snehamaa..chelagaatamaa..
Eppudu nee mudi vesthaavo..
Eppudelaa vidadeesthaavo..
Pranayamaa..parihaasamaa..
Sapinche daivamaa..
Dahinche deepamaa..
Ide nee roopamo premaa..
Phalisthe paapamaa..
Kalisthe lopamaa..
Gelisthe nashtamaa premaa..
Charanam:1
Ee kalathaa.. Chaalle mamathaa..
Marapuraani smruthulalone ragilipothaavaa..
Maraliraani gathamulone migilipothaavaa..
Reppalu daatavu swapnaalu..
Cheppaka thappadu veedkolu..
Ooruko o hrudayamaa..
Nijam nishtooramaa..
Thelisthe nashtamaa..
Kanneetiki cheppave premaa..
Phalisthe paapamaa.. Kalisthe kopamaa..
Gelisthe nashtamaa premaa..
Charanam:2
Ventarammantoo theestukelathaavu..
Nammivasthe nattadivilo vidichi pothaavu..
Jantakammantoo aasa pedathaavu..
Kalimi unche chelimi thunche kalahamouthaavu..
Chesina baasalu ennante..
Cheppina oosulu evante..
Mounamaa.. Mamakaaramaa..
Choopullo soonyamaa..
Gundello gaayamaa
Telugu Transliteration
ఎందుకు చెంతకి వస్తావో ..ఎందుకు చేయొదిలేస్తావోస్నేహమా చెలగాటమా..
ఎప్పుడు నీ ముడి వేస్తావో..ఎప్పుడెలా విడదీస్తావో..ప్రణయమా పరిహాసమా
శపించే దైవమా..దహించే దీపమా
ఇదే నీ రూపమా ప్రేమా??
ఫలిస్తే పాపమా..కలిస్తే లోపమా..గెలిస్తే నష్టమా ప్రేమా??
ఈ..కలత...చాల్లే మమత...
మరపురాని స్మృతులలోనే రగిలిపోతావా..మరలి రాని గతముగానే మిగిలిపోతావా
రెప్పలు దాటవు స్వప్నాలు..చెప్పక తప్పదు వీడ్కోలు
ఊరుకో..ఓ హృదయమా..
నిజం నిష్ఠూరమా..తెలిస్తే కష్టమా..కన్నీటికి చెప్పవే ప్రేమా??
ఫలిస్తే పాపమా...కలిస్తే కోపమా..గెలిస్తే నష్టమా ప్రేమా??
వెంటరమ్మంటూ..తీసుకెళ్తావు..నమ్మి వస్తే నట్టడవిలో విడిచిపోతావు
జంటకమ్మంటూ..ఆశపెడతావు
కలిమి ఉంచే చెలిమి తుంచే కలహమవుతావు..
చేసిన బాసలు ఎన్నంటే...చెప్పిన ఊసులు ఏవంటే
మౌనమా...మమకారమా??
చూపుల్లో శూన్యమా...గుండెల్లో గాయమా..మరీ వేధించకే ప్రేమా...
ఎందుకు చెంతకి వస్తావో ..ఎందుకు చేయొదిలేస్తావో
స్నేహమా చెలగాటమా..
ఎప్పుడు నీ ముడి వేస్తావో..ఎప్పుడెలా విడదీస్తావో..ప్రణయమా పరిహాసమా
Added by