LYRIC

Idigo raayalaseema gadda .. Deeni katha telusuko telugubidda
idigo raayalaseema gadda .. Deeni katha telusuko telugubidda
idigo raayalaseema gadda .. Deeni katha telusuko telugubidda

Ee gaddalo pagala segalodduraa .. Ee mattilo netturolakodduraa

Idigo raayalaseema gadda .. Deeni katha telusuko telugubidda

Patita paavanudu tirupati venkatesvarudu
sarvarakshakudu sreesaila mallesvarudu
koluvunnadee seemalone
rankelidu lepaakshi basavanna silpam .. Ranaberi ninadinchu chandragiri durgam
nelakonnadee nelalone..ae..ae..

Idigo raayalaseema gadda .. Deeni katha telusuko telugubidda

Haruni kantike kannu arpinchina kannappa bhaktavarudu
vijayanagara saamraajya durantara krshnaraaya bhuvibhudu
charitrakekkina dharani idi
padaalane svara padaala nadipina annamayya krtulu..oo..oo.
Ihaparaala kalipina veerabrahmendra tatvagatulu..oo..oo.
Alalaipongina avani idi
alalaipongina avani idi

Anduke .. Ee gaddalo pagala segalodduraa .. Ee mattilo netturolakodduraa
idigo raayalaseema gadda .. Deeni katha telusuko telugubidda

Telladorala hadalettinchina uyyaalavaada narasimhaareddi..//Vandemaataram
madama tippaka svaraajya sangraamam nadipina kadapa kotireddi..//Vandemaataram
gaadicharla kalloori
sadaasivam abboori
hampanna .. Linganna
shek^ beer^ rabiyaabi
okkaraa iddaraa paduguraa noorguraa
endarendaro tyaagamoortulaku janmanichchina janani idi

Idigo raayalaseema gadda .. Deeni katha telusuko telugubidda

//Antati chirantana nirantara vigasvara vaibhavamto viraajillina raayalaseema
//mana raitannala seema
//eenaadu dushkara mushkara saktula durantaraalato
//atalaakutalamavutunte ..
//Choostoo untaaraa choostoone untaaraa

Ayite
yuvata vikraminchaali .. Navata viplavinchaali
naagontulaa garjinche naadame mahodhyamamai
kullina ee vyavasthake kotta netturekkinchaali
sarikotta charita srshtinchaali
sarikotta charita srshtinchaali..ee..ee..

Telugu Transliteration

ఇదిగో రాయలసీమ గడ్డ .. దీని కథ తెలుసుకో తెలుగుబిడ్డ
ఇదిగో రాయలసీమ గడ్డ .. దీని కథ తెలుసుకో తెలుగుబిడ్డ
ఇదిగో రాయలసీమ గడ్డ .. దీని కథ తెలుసుకో తెలుగుబిడ్డ

ఈ గడ్డలో పగల సెగలొద్దురా .. ఈ మట్టిలో నెత్తురొలకొద్దురా

ఇదిగో రాయలసీమ గడ్డ .. దీని కథ తెలుసుకో తెలుగుబిడ్డ

పతిత పావనుడు తిరుపతి వేంకటేశ్వరుడు
సర్వరక్షకుడు శ్రీశైల మల్లేశ్వరుడు
కొలువున్నదీ సీమలోనే
రంకెలిడు లేపాక్షి బసవన్న శిల్పం .. రణబేరి నినదించు చంద్రగిరి దుర్గం
నెలకొన్నదీ నేలలోనే..ఏ..ఏ..

ఇదిగో రాయలసీమ గడ్డ .. దీని కథ తెలుసుకో తెలుగుబిడ్డ

హరుని కంటికే కన్ను అర్పించిన కన్నప్ప భక్తవరుడు
విజయనగర సామ్రాజ్య దురంతర కృష్ణరాయ భువిభుడు
చరిత్రకెక్కిన ధరణి ఇది
పదాలనే స్వర పదాల నడిపిన అన్నమయ్య కృతులు..ఊ..ఊ.
ఇహపరాల కలిపిన వీరబ్రహ్మేంద్ర తత్వగతులు..ఊ..ఊ.
అలలైపొంగిన అవని ఇది
అలలైపొంగిన అవని ఇది

అందుకే .. ఈ గడ్డలో పగల సెగలొద్దురా .. ఈ మట్టిలో నెత్తురొలకొద్దురా
ఇదిగో రాయలసీమ గడ్డ .. దీని కథ తెలుసుకో తెలుగుబిడ్డ

తెల్లదొరల హడలెత్తించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి..//వందేమాతరం
మడమ తిప్పక స్వరాజ్య సంగ్రామం నడిపిన కడప కోటిరెడ్డి..//వందేమాతరం
గాడిచర్ల కల్లూరి
సదాశివం అబ్బూరి
హంపన్న .. లింగన్న
షేక్ బీర్ రబియాబి
ఒక్కరా ఇద్దరా పదుగురా నూర్గురా
ఎందరెందరో త్యాగమూర్తులకు జన్మనిచ్చిన జనని ఇది

ఇదిగో రాయలసీమ గడ్డ .. దీని కథ తెలుసుకో తెలుగుబిడ్డ

//అంతటి చిరంతన నిరంతర విగస్వర వైభవంతో విరాజిల్లిన రాయలసీమ
//మన రైతన్నల సీమ
//ఈనాడు దుష్కర ముష్కర శక్తుల దురంతరాలతో
//అతలాకుతలమవుతుంటే ..
//చూస్తూ ఉంటారా చూస్తూనే ఉంటారా

అయితే
యువత విక్రమించాలి .. నవత విప్లవించాలి
నాగొంతులా గర్జించే నాదమే మహోధ్యమమై
కుళ్ళిన ఈ వ్యవస్థకె కొత్త నెత్తురెక్కించాలి
సరికొత్త చరిత సృష్టించాలి
సరికొత్త చరిత సృష్టించాలి..ఈ..ఈ..

SHARE

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x