LYRIC
Pallavi:
Maaghamaasa vela kokilamma paata
prema parnashaala chuputunna baata
anuraagam todu raagaa navalokam yelukogaa
shubhalagnam cherukundani pilichelaa
maaghamaasa vela kokilamma paata
Charanam:1
Yevarini ne chusinaa adugulu yetu vesinaa
yedurayedi nuvve neku telusunaa
ninu kalavani rojuna gadavadu yem chesinaa
vadalanandi nanne teepi yaatana
nuvu vetike majilee avanaa..
Necheligaa madilo cheranaa
ika atu itu yegarake paavuramaa
na kougili koluvuna stirapadamaa
talapunu dochina doratanamaa
na anumati tamakika avasaramaa
nannu nelo ninnu nalo nimpe ne prema
maaghamaasa vela
Charanam:2
Manasuki mali janmagaa nuvu malichina bommagaa
ninnu allukonee kotta upiri..
Gaganamu digi nerugaa priyasakhilaa cheragaa
nannu kalusukundaa ningi jaabili
na manavini vinave vinavaa
idi nijamani anane anavaa
nadi nadakalu nerpina saagaramaa
ne odilo odigite chaalu sumaa
teliyani saigala swagatamaa
ee bidiyamu denike soyagamaa
aaganeedu saaganeedu chudu ee prem
Telugu Transliteration
పల్లవి:మాఘమాస వేళ కోకిలమ్మ పాట
ప్రేమ పర్ణశాల చూపుతున్న బాట
అనురాగం తోడు రాగా నవలోకం ఏలుకోగా
శుభలగ్నం చేరుకుందని పిలిచేలా
మాఘమాస వేళ కోకిలమ్మ పాట
చరణం:1
ఎవరిని నే చూసినా అడుగులు ఎటు వేసినా
ఎదురయేది నువ్వే నీకు తెలుసునా
నిను కలవని రోజున గడవదు ఏం చేసినా
వదలనంది నన్నే తీపి యాతన
నువ్వు వెతికే మజిలీ అవనా..
నెచ్చెలిగా మదిలో చేరనా
ఇక అటు ఇటు ఎగరకే పావురమా
నా కౌగిలి కొలువున స్థిరపడుమా
తలపును దోచిన దొరతనమా
నా అనుమతి తమకిక అవసరమా
నన్ను నీలో నిన్ను నాలో నింపే నీ ప్రేమ
మాఘమాస వేళ
చరణం:2
మనసుకి మలి జన్మగా నువ్వు మలిచిన బొమ్మగా
నిన్ను అల్లుకోనీ కొత్త ఊపిరి..
గగనము దిగి నేరుగా ప్రియసఖిలా చేరగా
నన్ను కలుసుకుందా నింగి జాబిలి
నా మనవిని విననే వినవా
ఇది నిజమని అననే ఆనవా
నది నడకలు నేర్పిన సాగరమా
నీ ఒడిలో ఒదిగితే చాలు సుమా
తెలియని సైగల స్వాగతమా
ఈ బిడియము దేనికే సోయగమా
ఆగనీదు సాగనీదు చూడు ఈ ప్రే
Added by