LYRIC
Pallavi:
Manasu gati inte manishi bratukinte
manasunna manishiki sukhamu ledante//2//
Charanam:1
Okarikiste marali radu
odipote marichi podu
gayamaite masipodu
pagilipote atuku padadu
Charanam:2
Antaa mattenani telusu
adee oka mayenani telusu
telisi valachi vilapinchutaloo
teeyadanam evariki telusu
Charanam:3
Maru janma unnado ledo
ee mamatalappudemoutaayo
manishiki manase teerani shikshaa….
Devudilaa teerchukunnadu kaksha
Telugu Transliteration
పల్లవి:మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికి సుఖము లేదంతే//2//
చరణం:1
ఒకరికిస్తే మరలి రాదు
ఓడిపోతే మరిచి పోదు
గాయమైతే మాసిపోదు
పగిలిపోతే అతుకు పడదు
చరణం:2
అంతా మట్టేనని తెలుసు
అదీ ఒక మాయేనని తెలుసు
తెలిసి వలచి విలపించుటలో
తీయదనం ఎవరికి తెలుసు
చరణం:3
మరు జన్మ ఉన్నదో లేదో
ఈ మమతలప్పుడేమౌతాయో
మనిషికి మనసే తీరని శిక్షా....
దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష