LYRIC

Gunde daati gontu daati palikindedo vainam
moduvaarina manasulone palikindedo praanam

Aa kannullone gangai pongina aanandam
kaalamto parihaasam chesina sneham

Poddulu daati haddulu daati
jagamulu daati yugamulu daati

Cheyyandinchamandi oka paasam .. Rna paasam vidhi vilaasam
cheyyandinchamandi oka paasam .. Rna paasam vidhi vilaasam

Adagaale kaanee .. Edainaa ichche .. Annayyanautaa
pilavaale kaanee .. Paliketi todu .. Needayyipotaa

Neeto unte chaalu .. Saritoogavu saamraajyaalu
raatri pagalu lede digulu
tadise kanulu idivarakerugani premalo .. Gaaramlo

Cheyyandinchamandi oka paasam .. Rna paasam vidhi vilaasam
praanaalu istaanandi oka bandham .. Runabandham

Noraaraa velige .. Navvulni nenu .. Kallaaraa choosaa
reppallo odige .. Kantipaapallo .. Nannu nenu kalisaa

Neeto unte chaalu .. Prati nimisham o harivillu
raatri pagalu lede gubulu
murise edalu idivarakerugani premalo .. Gaaramlo

Cheyyandinchamandi oka paasam .. Rna paasam vidhi vilaasam
cheyyandinchamandi oka bandham .. Rnabandham

Aatallone paatallone velisindedo svargam
raaje nedu bantai poyinaa raajyam neeke sontam

Telugu Transliteration

గుండె దాటి గొంతు దాటి పలికిందేదో వైనం
మోడూవారిన మనసులోనే పలికిందేదో ప్రాణం

ఆ కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం
కాలంతో పరిహాసం చేసిన స్నేహం

పొద్దులు దాటి హద్దులు దాటి
జగములు దాటి యుగములు దాటి

చెయ్యందించమంది ఒక పాశం .. ఋణ పాశం విధి విలాసం
చెయ్యందించమంది ఒక పాశం .. ఋణ పాశం విధి విలాసం

అడగాలే కానీ .. ఏదైనా ఇచ్ఛే .. అన్నయ్యనౌతా
పిలవాలే కానీ .. పలికేటి తోడు .. నీడయ్యిపోతా

నీతో ఉంటే చాలు .. సరితూగవు సామ్రాజ్యాలు
రాత్రి పగలు లేదే దిగులు
తడిసె కనులు ఇదివరకెరుగని ప్రేమలో .. గారంలో

చెయ్యందించమంది ఒక పాశం .. ఋణ పాశం విధి విలాసం
ప్రాణాలు ఇస్తానంది ఒక బంధం .. రుణబంధం

నోరారా వెలిగే .. నవ్వుల్ని నేను .. కళ్ళారా చూసా
రెప్పల్లో ఒదిగే .. కంటిపాపల్లో .. నన్ను నేను కలిసా

నీతో ఉంటే చాలు .. ప్రతి నిమిషం ఓ హరివిల్లు
రాత్రి పగలు లేదే గుబులు
మురిసే ఎదలు ఇదివరకెరుగని ప్రేమలో .. గారంలో

చెయ్యందించమంది ఒక పాశం .. ఋణ పాశం విధి విలాసం
చెయ్యందించమంది ఒక బంధం .. ఋణబంధం

ఆటల్లోనే పాటల్లోనే వెలిసిందేదో స్వర్గం
రాజే నేడు బంటై పోయినా రాజ్యం నీకే సొంతం

SHARE

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x