LYRIC

Ori vaari inka pindutunnaavraa paalu,
igeppudu potavraa oolleku nee yakka..!
Iga poddu poddunnae modalupetnaavayaa, nee paasugaala..!

Kolonaa palle kodi kootalle .. Ollirusukunde kode lyaagalle
yaapa pullala shedu namilinde, raama raama raama
talaku posukunde… naa nela talle
aliki poosukunde.. Muggu sukkalne
saddi mootalne saga bettukunde .. Baayi giraka naa palle

Hae, tella tellaani paaladhaaralalla .. Palle tellaarutuntadiraa
gulloni gantalu kaadedla medalone .. Jantaga moguta untayiraa
naagali bhujaana pettukunte .. Dostulu cheyyesinatteraa
goddu godaa pakkana unte .. Kondanta balagam unnatturaa

Sallagaali mosukochcheraa .. Senu selkala muchchatlu
daari podugu setla kommalaa .. Raalutunna poola sappatlu
gaddi mopulu kaalva gattulu .. Semata sukkallo tadisina ee matti gandhaala…

Ooru palletooru… deeni teere amma teeru
kongulona daasipetti … kodukukichche prema veru
ooru palletooru … deeni teere kannakooturu
kandla munde edugutunna sambaraalaa pantapairu

Vanda gadapala manda naa palle .. Goda kattani goodu naa palle
seruvulla tulleti jella saapole, raama raama raama
maava atta baava baapu varasalle .. Ooranta suttaala mulle naa palle
daaramlo odigina poola dandalle rangula singidi palle

Aalu mogalu aade aatalu .. Atta kodandla kotlaataloo
sadiri seppaleni mogani tippale tippaloo ..oo .. Oo …
Rachchabanda meeda aatalu .. Chaayabandi kaada maatalu
vochche poyyetolla mandalichchukune sangate gammattee

Tatta buttalalla koora tokkulu .. Sutta buttalalla beedi kattalu
chetanaina saayam jese manushulu .. Maavi poota kaasinatte manusulu
oorante roju ugaadi sachchedaakaa untadi yaadi

Ooru naa ooru… deeni teere amma teeru
kongulona daasipetti kodukukichche prema veru
ooru palletooru … deeni teere kannakooturu
kandla munde edugutunna … sambaraala pantapairu

Vanda gadapalaa manda naa palle .. Goda kattani goodu naa palle
seruvulla tulleti jella saapole, raama raama raama
maava atta baava baapu varasalle .. Ooranta suttaala mulle naa palle
daaramlo odigina poola dandalle rangula singidi palle

Telugu Transliteration

ఓర్ వారి ఇంక పిండుతున్నావ్రా పాలు,
ఇగెప్పుడు పోతవ్రా ఊల్లెకు నీ యక్క..!
ఇగ పొద్దు పొద్దున్నే మొదలుపెట్నావయా, నీ పాసుగాల..!

కోలోనా పల్లె కోడి కూతల్లే .. ఒల్లిరుసుకుందే కోడె ల్యాగల్లే
యాప పుల్లల షేదు నమిలిందే, రామ రామ రామ
తలకు పోసుకుందె… నా నేల తల్లే
అలికి పూసుకుందె.. ముగ్గు సుక్కల్నే
సద్ది మూటల్నే సగ బెట్టుకుందే .. బాయి గిరక నా పల్లే

హే, తెల్ల తెల్లాని పాలధారలల్ల .. పల్లె తెల్లారుతుంటదిరా
గుళ్లోని గంటలు కాడెడ్ల మెడలోనే .. జంటగ మోగుత ఉంటయిరా
నాగలి భుజాన పెట్టుకుంటే .. దోస్తులు చెయ్యేసినట్టేరా
గొడ్డు గోదా పక్కన ఉంటే .. కొండంత బలగం ఉన్నట్టురా

సల్లగాలి మోసుకొచ్చెరా .. సేను సెల్కల ముచ్చట్లు
దారి పొడుగు సెట్ల కొమ్మలా .. రాలుతున్న పూల సప్పట్లు
గడ్డి మోపులు కాల్వ గట్టులు .. సెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల…

ఊరు పల్లెటూరు… దీని తీరే అమ్మ తీరు
కొంగులోన దాసిపెట్టి … కొడుకుకిచ్చె ప్రేమ వేరు
ఊరు పల్లెటూరు … దీని తీరే కన్నకూతురు
కండ్ల ముందే ఎదుగుతున్న సంబరాలా పంటపైరు

వంద గడపల మంద నా పల్లె .. గోడ కట్టని గూడు నా పల్లె
సెరువుల్ల తుల్లేటి జెల్ల శాపోలే, రామ రామ రామ
మావ అత్త బావ బాపు వరసల్లే .. ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె
దారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లే

ఆలు మొగలు ఆడే ఆటలు .. అత్త కోడండ్ల కొట్లాటలూ
సదిరి సెప్పలేని మొగని తిప్పలే తిప్పలూ ..ఓఓ .. ఓఓ ...
రచ్చబండ మీద ఆటలు .. చాయబండి కాడ మాటలు
వొచ్చే పొయ్యేటోల్ల మందలిచ్చుకునే సంగతే గమ్మత్తీ

తట్ట బుట్టలల్ల కూర తొక్కులు .. సుట్ట బుట్టలల్ల బీడి కట్టలు
చేతనైన సాయం జేసే మనుషులు .. మావి పూత కాసినట్టే మనుసులు
ఊరంటే రోజు ఉగాది సచ్చేదాకా ఉంటది యాది

ఊరు నా ఊరు… దీని తీరే అమ్మ తీరు
కొంగులోన దాసిపెట్టి కొడుకుకిచ్చె ప్రేమ వేరు
ఊరు పల్లెటూరు … దీని తీరే కన్నకూతురు
కండ్ల ముందే ఎదుగుతున్న … సంబరాల పంటపైరు

వంద గడపలా మంద నా పల్లె .. గోడ కట్టని గూడు నా పల్లె
సెరువుల్ల తుల్లేటి జెల్ల శాపోలే, రామ రామ రామ
మావ అత్త బావ బాపు వరసల్లే .. ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె
దారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లే

SHARE

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x