LYRIC
Pallavi:
Padahaarellaku nelo nalo aa prayam chese
chilipi panulaku koti dandaalu//2//
vennelalle viriyabuchi velluvalle urakalese
padahaarellaku….
Charanam:1
Parupulu parachina isuka tinnelaku
patalu padina chirugalulaku
terachatosagina chelulu shilalaku//2//
deevena jallulu challina alalaku
koti dandaalu shata koti dandaalu…//padahaarellaku//
Charanam:2
Nato kalisi nadachina kallaku
nalo ninne nimpina kallaku
ninne piliche na pedavulaku
nekai chikkina na nadumunaku
koti dandaalu shata koti dandaalu..
Charanam:3
Bhramalo lepina toli jamulaku
samayam kudirina sande velalaku
ninnu nannu kannavaallak//(2//
manakai veche mundu naallaku..
Telugu Transliteration
పల్లవి:పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే
చిలిపి పనులకు కోటి దండాలు(2)
వెన్నెలల్లె విరియబూచి వెల్లువల్లే ఉరకలేసే
పదహారేళ్ళకు ....
చరణం:1
పరుపులు పరచిన ఇసుక తిన్నెలకు
పాటలు పాడిన చిరుగాలులకు
తెరచాటొసగిన చెలులు శిలలకు(2)
దీవెన జల్లులు చల్లిన అలలకు
కోటి దండాలు శత కోటి దండాలు...
చరణం:2
నాతో కలిసి నడచిన కాళ్ళకు
నాలో నిన్నే నింపిన కళ్ళకు
నిన్నే పిలిచే నా పెదవులకు
నీకై చిక్కిన నా నడుమునకు
కోటి దండాలు శత కోటి దండాలు..
చరణం:3
భ్రమలో లేపిన తొలి జాములకు
సమయం కుదిరిన సందె వేళలకు
నిన్ను నన్ను కన్నవాళ్ళకు(2)
మనకై వేచే ముందు నాళ్ళకు..