LYRIC
Pallavi:
Pratee nijam pagati kalagaa
niraashagaa nilavanaa
pratee kshanam kalata padagaa
nireekshagaa gadapanaa
kanneeti sandramlo naavanai
yennallee yedureeta
yenadu ye teeram yeduta kanapadaka
Charanam:1
Pedavulu marachina chiru nagavai
ninu rammani pilichaanaa
vetakani velugula parichayamai
varamimmani adigaanaa
nidarapoye yedanu lepi nishanu chupinchagaa
aashato chaachina dosita shunyam nimpi
karagakumaa na kannulane veli vesi….
Charanam:2
Yekkada nuvvani dikkulalo
ninu vetikina naa keka
shilalanu taakina pratidhwanigaa
nanu cherite ontarigaa
sagamulone alasipoye payanamayyaagaa
isukanu chesina santakamaa ne sneham
ye ala ninu cheripindo telupadu kaalam
Telugu Transliteration
పల్లవి:ప్రతీ నిజం పగటి కలగా
నిరాశగా నిలవనా
ప్రతీ క్షణం కలత పడగా
నిరీక్షగా గడపనా
కన్నీటి సంద్రంలో నావనై
ఎన్నాళ్ళీ ఎదురీత
ఏనాడు ఏ తీరం ఎదుట కనపడక
చరణం:1
పెదవులు మరచిన చిరు నగవై
నిను రమ్మని పిలిచానా
వెతకని వెలుగుల పరిచయమై
వరమిమ్మని అడిగానా
నిదరపోయే ఎదను లేపి నిశను చూపించగా
ఆశతో చాచిన దోసిట శూన్యం నింపి
కరగకుమా నా కన్నులనే వెలి వేసి....
చరణం:2
ఎక్కడ నువ్వని దిక్కులలో
నిను వెతికిన నా కేక
శిలలను తాకిన ప్రతిధ్వనిగా
నను చేరితే ఒంటరిగా
సగములోనే అలసిపోయే పయనమయ్యాగా
ఇసుకను చేసిన సంతకమా నీ స్నేహం
ఏ అల నిను చేరిపిందో తెలుపదు కాలం
Added by