LYRIC
Pallavi:
Raama raama raghuraama ani paadutunna hanuma
anta bhakti paravasama o kantha mammu ganumaa
saradaaga naa gaali paata vinuma
vinaaka badulicchi aadukonumaa
gaaliki putta gaaliki periga accham neelaaga
nityam neeto unnaaga iddari lakshanamokate gaa
charanam: 1
Ammalle nanu penchindi ee palle seema
naanalle nadipinchindi ooranta prema
ammalle nanu penchindi ee palle seema
naanalle nadipinchindi ooranta prema
yelaa penchukunnaa yelaa piluchukunnaa
ee matti sontam naa chitti janmam
anni sonta ille anta ayinavaalle
ee sneha bandham naa poorva punyam
bratukanta idi teere runamaa
charanam: 2
Ye aatalaadistaavo o koti bomma
ye baata choopistaavo kaanunna brahma
prasannaanjaneyam ade naamadeyam
prati manchi kaaryam jaripinchu daivam
prabhadivya kaayam prakeertipradaayam
naaloni dhairyam sree aanjaneyam
naa vente nuvvunte bhayamaa
Telugu Transliteration
పల్లవి:రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా
అంతభక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా
సరదాగా నా గాలిపాట వినుమా
విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా
గాలికి పుట్టా గాలికి పెరిగా అచ్చం నీలాగ
నిత్యం నీతో వున్నాగా ఇద్దరి లక్షణమొకటేగా....
చరణం:1
అమ్మల్లె నను పెంచింది ఈ పల్లె సీమ
నాన్నల్లె నడిపించింది ఊరంత ప్రేమ ||అమ్మల్లె||
ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా
ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మం
అన్నీ సొంతం ఇల్లే అంతా అయినవాళ్ళే
ఈ స్నేహబంధం నా పూర్వపుణ్యం
బతుకంతా ఇది తీరే ఋణమా..... ||రామరామ||
చరణం:2
ఏ ఆటలాడిస్తావో ఓ కోతిబొమ్మా....
ఏ బాట చూపిస్తావో కానున్న బ్రహ్మ
ప్రసన్నాంజనేయం అనే నామధేయం
ప్రతి మంచి కార్యం జరిపించు దైవం
ప్రభాదివ్వకాయం ,ప్రకీర్తిప్రదాయం
నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం
నా వెంట నువ్వుంటే భయమా.... ||రామ రామ||
Comments are off this post