LYRIC

//Pallavi :
odanu jaripe muchchata kanare vanitalaaraa nedu
odanu jaripe muchchata kanare vanitalaaraa nedu
aaduvaaru yamunakaada… Aa…
Aaduvaaru yamunakaada krshnuni koodi
aaduchu paaduchu andaru choodagaa
odanu jaripe muchchata kanare…

//Charanam : 1
valapu tadee tiranaale pongina etiki andam
kerataalaku vayyaaram karige teeram
tilakamidde kiranaale podduti toorupukandam
chinadaaniki singaaram siga mandaaram
padaalameede padava pedaalu kore godava
edallo moge daruve kadangaa naave nadava
ilaa neelaa..ti revulo
odanu jaripe muchchata kanare vanitalaaraa nedu
odanu jaripe muchchata kanare vanitalaaraa nedu

//Charanam : 2
chilipi tadee vennelale gautami kaugilikandam
toli chooluku sreekaaram nadake bhaaram
uliki pade ooyalale kannula paapalakandam
nelavankala seemantam odilo deepam
taraalu maare jatale svaraalu paade kathalo
sagaalai poye manuve srjinche moodo tanuve
tyaagayya raamalaalilo
odanu jaripe muchchata kanare vanitalaaraa nedu
odanu jaripe muchchata kanare vanitalaaraa nedu

Telugu Transliteration

//పల్లవి :
ఓడను జరిపే ముచ్చట కనరే వనితలారా నేడు
ఓడను జరిపే ముచ్చట కనరే వనితలారా నేడు
ఆడువారు యమునకాడ... ఆ...
ఆడువారు యమునకాడ కృష్ణుని కూడి
ఆడుచు పాడుచు అందరు చూడగా
ఓడను జరిపే ముచ్చట కనరే...

//చరణం : 1
వలపు తడీ తిరణాలే పొంగిన ఏటికి అందం
కెరటాలకు వయ్యారం కరిగే తీరం
తిలకమిద్దే కిరణాలే పొద్దుటి తూరుపుకందం
చినదానికి సింగారం సిగ మందారం
పదాలమీదే పడవ పెదాలు కోరే గొడవ
ఎదల్లో మోగే దరువే కదంగా నావే నడవ
ఇలా నీలా..టి రేవులో
ఓడను జరిపే ముచ్చట కనరే వనితలారా నేడు
ఓడను జరిపే ముచ్చట కనరే వనితలారా నేడు

//చరణం : 2
చిలిపి తడీ వెన్నెలలే గౌతమి కౌగిలికందం
తొలి చూలుకు శ్రీకారం నడకే భారం
ఉలికి పడే ఊయలలే కన్నుల పాపలకందం
నెలవంకల సీమంతం ఒడిలో దీపం
తరాలు మారే జతలే స్వరాలు పాడే కథలో
సగాలై పోయే మనువే సృజించే మూడో తనువే
త్యాగయ్య రామలాలిలో
ఓడను జరిపే ముచ్చట కనరే వనితలారా నేడు
ఓడను జరిపే ముచ్చట కనరే వనితలారా నేడు

SHARE

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x