LYRIC

Aa neeli gaganaana meriseti o divyataara
Enneni janmaalu vechanu ne ninnu chera
enaati swapnam nee divya roopam …
Sathakoti raagaalu ravalinche naa gundelonaa
Oo priyatamaa idhi nijama
Ee parichayam oka varama
Idhi manasu padina viraha vedanaa…
Tholi premaloni madhura bhavanaa…

ye muthyamu ee mabbulo dhaagunnadho telisedhela
ye snehamu anubhandamai vodicheruno telipedhela
Naa gunde podarinta neekallu vaalaka ee aasa chigurincheno
Vechani nee swasa naa menu thadimaaka ye uha sruthimincheno
Enni janmaala bhaandaalu sree praarijaatalai vichayo cheppedela
Enni nayanaalu naa vanka erranga choosayo aa guttu vippedela
Oo piryatama dayaganumaa
Nee choope chaalu chandrakiranamaa
Naa janma dhanyamavunu pranamaaaa…

Chivuraakula pothilallo vikasinchina sirimallevo
Chirugaalitho selyetipai narthinchina nelavankavo
Navvemo naajukuu nadumemo pooreku nee andame mandunee
Palukemo raa chiluka nadakemo raayancha ollantaa vayyarame
Nee naamanney srungaara vedanga bhaavinchi japiistunaney cheli…
Nee paadale naa premasoudaalugaa enchi poojinchanaa necheli
Oo priyatama oounanumaa
kanaleva priyuni hrudayavedana
Karuninchu naaku valapu deevenaa…

Aa neeli gaganaana meriseti o divyathaara
Enneni janmaalu vechanu ne ninnu chera
enaati swapnam nee divya roopam …
Sathakoti raagaalu ravalinche naa gundelonaa

Telugu Transliteration

ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్య తారా ...
ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా ...
ఏ నాటి స్వప్నం నీ దివ్య రూపం
శతకోటి రాగాలు రవలించే నా గుండె లోనా ...
ఓ ప్రియతమా ఇది నిజమా ... ఈ పరిచయం ఒక వరమా
ఇది మనసు పడిన విరహవేదనా ...
ఆ ... తొలి ప్రేమలోని మధుర భావనా ఆ ... ఆ

ఏ ముత్యము ఏ మబ్బులో దాగున్నదో తెలిసేదెలా
ఏ స్నేహము అనుబంధమై ఒడిచేరునో తెలిపేదెలా
నా గుండె పొదరింట నీ కళ్ళు వాలాక ఏ ఆశ చిగురించెనో ...
వెచ్చని నీ శ్వాస నా మేను తడిమాక ఏ ఊహ శృతిమించెనో ...
ఎన్ని జన్మాల బంధాలు శ్రీ పారిజాతాలై విచ్చాయో చెప్పేదెలా ...
ఎన్ని నయనాలు నావంక చూసాయో ఆ గుట్టు విప్పేదెలా
ఓ ప్రియతమా... దయ గనుమా ...
నీ చూపే చాలు చంద్ర కిరణమా ...
నా జన్మ ధన్యమౌను ప్రాణమా ...

చిగురాకులా పొత్తిల్లలో వికసించినా సిరిమల్లెవో ...
చిరుగాలితో సెలయేటిపై నర్తించినా నెలవంకవో ...
నవ్వేమో నాజూకు నడుమేమో పూరేకు నీ అందమేమందునే ...
పలుకేమో రాచిలక నడకేమో లాలించ వొల్లంత వయ్యారమే ...
నీ నామాన్నే శృంగారవేదంగా భావించి జపిస్తున్నానే చెలి ...
నీ పాదాలే నా ప్రేమ సౌధాలుగా ఎంచి పూజించనా నే చెలి...
ఓ ప్రియతమా ...ఔననుమా ...
కన లేవ ప్రియుని హృదయ వేదనా ...
కరుణించు నాకు వలపు దీవెనా ఆ ...

ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్య తారా ...
ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా ...
ఏ నాటి స్వప్నం నీ దివ్య రూపం
శతకోటి రాగాలు రవలించే నా గుండె లోనా ...


Added by

Meghamala K

SHARE

VIDEO