LYRIC

Chikatitho veluge cheppenu
Nenunnanani
Otamitho gelupe cheppenu
Nenunnanani
Nenunnanani neekem kadhani
Ninnati raathani marchesthanani

Thagile raallani
Punadhi chesi edagaalani
Tharime vaallani
Hithuluga thalachi mundhukellaalani

 

Kannula neetini kalala saagukai
Vadukovalani
Kaalche nippuni pramidhaga malachi
Kaanthi panchalani
Gundetho dhairyam cheppenu
Chuputho maargam cheppenu
Adugutho gamyam cheppenu
Nenunnaanani
Nenunnanani neekem kadhani
Ninnati raathani marchesthanani

Evvaru leni ontari jeeviki
Thodu dhorikindhani
Andharu vunnaa aapthudu nuvvai
Cheruvayavani
Janmaki erugani anuraagaanni
Panchuthunnaavani
Janmalu chaalani anubandhanni
Penchukunnamani
Shwaasatho shwaase cheppenu
Manasutho manase cheppenu
Prashnatho badhule cheppenu
Nenunnanani
Nenunnanani neekem kadhani
Ninnati raathani marchesthanani

Chikatitho veluge cheppenu
Nenunnanani
Otamitho gelupe cheppenu
Nenunnanani
Nenunnanani neekem kadhani
Ninnati raathani marchesthanani

 

Telugu Transliteration

చీకటితో వెలుగే చెప్పెను
నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను
నేనున్నానని
నేనున్నాననీ నీకేం కాదనీ
నిన్నటి రాతనీ మార్చేస్తాననీ

తగిలే రాళ్లని
పునాది చేసి ఎదగాలనీ
తరిమే వాళ్లని
హితులుగ తలచి ముందుకెళ్లాలనీ

కన్నుల నీటిని కలల సాగుకై
వాడుకోవాలనీ
కాల్చే నిప్పుని ప్రమిదగ మలచి
కాంతి పంచాలని
గుండెతో ధైర్యం చెప్పెను
చూపుతో మార్గం చెప్పెను
అడుగుతో గమ్యం చెప్పెను
నేనున్నానని
నేనున్నాననీ నీకేం కాదనీ
నిన్నటి రాతనీ మార్చేస్తాననీ

ఎవ్వరు లేని ఒంటరి జీవికి
తోడు దొరికిందనీ
అందరు వున్నా ఆప్తుడు నువ్వై
చేరువయ్యావని
జన్మకి ఎరుగని అనురాగాన్ని
పంచుతున్నావనీ
జన్మలు చాలని అనుబంధాన్ని
పెంచుకున్నామని
శ్వాసతో శ్వాసే చెప్పెను
మనసుతో మనసే చెప్పెను
ప్రశ్నతో బదులే చెప్పెను
నేనున్నానని
నేనున్నాననీ నీకేం కాదనీ
నిన్నటి రాతనీ మార్చేస్తాననీ

చీకటితో వెలుగే చెప్పెను
నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను
నేనున్నానని
నేనున్నాననీ నీకేం కాదనీ
నిన్నటి రాతనీ మార్చేస్తాననీ






Added by

malliktajmahal@gmail.com

SHARE

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

VIDEO

%d bloggers like this: