LYRIC

Pallavi:

“nee manasuki manase ledule”                      || 2 ||

Unte nannilaa vadili podule

Elaa bratikedi nenu …

Gunde ninda nuvve undi , kallamundu lekapote

Elaa…elaa.. Elaa..elaa                                     || 2 ||

Elaa elaa undedelaa praanam …praanam    || nee manasuki ||

 

Charanam 1

Manasantaa … Tolichese bhaadaa

Jaare jaare kanneellaki maataloste enta baagunno

Eda sadi vintunnaavaa .. Vinabadi koodaa daakkunnaavaa

Teliyaka chestunnaavaa .. Telise choostunnaavaa

Chirunavvulu poosina vaasantaale  aasalu raale sisiraalavutunte

Elaa elaa elaa elaa undedelaa praanam …praanam

 

Charanam 2

Kanipinchu .. Ne poyelogaa

Vela vela kallallonaa vattulesi ninnu vetukutunnaagaa

Manasuni premaga iste .. Manasani teliyaka visiresaavaa

Bahumatigaa nanniste .. Baruvani dinchesaavaa

Nuvvu eppatikappudu gurtuku vachchi oopiri koodaa bhaaram avutunte

Elaa…elaa.. Elaa..elaa ||2||

Elaa elaa undedelaa praanam …praanam || 2 ||

Telugu Transliteration

పల్లవి:
"నీ మనసుకీ మనసే లేదులే" || 2 ||
ఉంటే నన్నిలా వదిలీ పోదులే
ఎలా బ్రతికేది నేను ...
గుండె నిండ నువ్వే ఉండి , కళ్ళముందు లేకపొతే
ఎలా...ఎలా.. ఎలా..ఎలా || 2 ||
ఎలా ఎలా ఉండేదెలా ప్రాణం ...ప్రాణం || నీ మనసుకీ ||

చరణం 1
మనసంతా ... తొలిచేసే భాదా
జారే జారే కన్నీళ్ళకి మాటలొస్తే ఎంత బాగున్నో
ఎద సడి వింటున్నావా .. వినబడి కూడా దాక్కున్నావా
తెలియక చేస్తున్నావా .. తెలిసే చూస్తున్నావా
చిరునవ్వులు పూసిన వాసంతాలే ఆశలు రాలే శిశిరాలవుతుంటే
ఎలా ఎలా ఎలా ఎలా ఉండేదెలా ప్రాణం ...ప్రాణం

చరణం 2
కనిపించు .. నే పోయేలోగా
వేల వేల కళ్ళల్లోనా వత్తులేసి నిన్ను వెతుకుతున్నాగా
మనసుని ప్రేమగ ఇస్తే .. మనసని తెలియక విసిరేసావా
బహుమతిగా నన్నిస్తె .. బరువని దించేసావా
నువ్వు ఎప్పటికప్పుడు గుర్తుకు వచ్చి ఊపిరి కూడా భారం అవుతుంటే
ఎలా...ఎలా.. ఎలా..ఎలా ||2||
ఎలా ఎలా ఉండేదెలా ప్రాణం ...ప్రాణం || 2 ||

Added by

Meghamala K

SHARE