LYRIC

Pallavi :
Enthavarugani vedantulainagani
valucupu sokagane telipoduroy
kaipulo  kaipulo  kaipulo

 

charanam:1
hoy hoy cinnadi menilo merupunnadi
haha cepala talukkannadi
hoy saipalekunnadi          //2//
e vannekani valapu nammi valanu cikkuno
kaipulo – kaipulo – kaipulo   //entha//

charanam:2
adaku vayasuto ceraladaku
adite venukadaku – kudi vidipoku  //2//
manasutelisi, kalisimelisi, valapunimpuko
kaipulo – kaipulo – kaipulo   //entha//

 

charanam:3
bale bale…. Leta vayasubikimdile – tata
manasurimdile
lokamimtele – ahahaha – bale bale
pataruculu talacitalaci tata ugenoy
kaipulo – kaipulo – kaipulo   //entha//

Telugu Transliteration

పల్లవి :

ఎంతవారుగానీ వేదాంతులైనగానీ
వాలుచూపు సోకగానే తేలిపోదురోయ్
కైపులో - కైపులో - కైపులో


చరణం:1

హోయ్ హోయ్ చిన్నది మేనిలో మెరుపున్నది
హహ చేపలా తళుక్కన్నది
హోయ్ సైపలేకున్నది "2"
ఏ వన్నెకాని వలపు నమ్మి వలను చిక్కునో
కైపులో - కైపులో - కైపులో "ఎంత"


చరణం:2

అడకు వయసుతో చెరలాడకు
ఆడితే వెనుకాడకు - కూడి విడిపోకు "2"
మనసుతెలిసి, కలిసిమెలిసి, వలపునింపుకో
కైపులో - కైపులో - కైపులో "ఎంత"


చరణం:3

బలె బలె.... లేత వయసుబికిందిలే - తాత మనసూరిందిలే
లోకమింతేలే - అహహహ - బలె బలే
పాతరుచులు తలచితలచి తాత ఊగెనోయ్
కైపులో - కైపులో - కైపులో "ఎంత"

Added by

Latha Velpula

SHARE

Comments are off this post