LYRIC

Pallavi :
gopala bala ninne kori ni sannidhi ceri
ni cutte tirugutu umtanu          //gopala//

charanam:1

ni namam vimtuvumte niluvella
pulakimcenu
ni rupam kamtu vumte nanu nene
maricenu
hegita…. Natha    //2//
garala bala maramuceyyeddu
bairagini anukovaddu
nenu – a nene – i nenu //gopala//

charanam:2

e mudhulu kadamtunna na manase
nidenanna
pujari addam unna, na daivam nivenamma
krushnamma             //2//
ninu namminavanni natteta mumcestavo
mari gattumida cerustavo amta ni
baramannanu //gopala//

 

charanam:3
sirulamte asaledu varamemi akkaraledu
gitaparayaname na jivita lakshyam annanu
//2//
na muddumuripalanni tircedaka nilonanne
cercedaka nidalle ninnamte vumtanu
//gopala//

Telugu Transliteration

పల్లవి :

గోపాల బాల నిన్నే కోరి నీ సన్నిధి చేరి
నీ చుట్టే తిరుగుతు ఉంటాను "గోపాల"


చరణం:1

నీ నామం వింటూవుంటే నిలువెల్లా పులకించేను
నీ రూపం కంటూ వుంటే నను నేనే మరిచేను
హేగీతా.... నాథా! "2"
గారాల బాలా మారాముచెయ్యెద్దు
బైరాగిని అనుకోవద్దు
నేను - ఆ నేనే - ఈ నేను "గోపాల"


చరణం:2

ఏ మూఢులు కాదంటున్నా నా మనసే నీదేనన్నా
పూజారి అడ్డం ఉన్నా, నా దైవం నీవేనమ్మా
కృష్ణమ్మా "2"
నిను నమ్మినవాణ్ణి నట్టేట ముంచేస్తావో
మరి గట్టుమీద చేరుస్తావో అంతా నీ భారమన్నాను "గోపాల"


చరణం:3

సిరులంటే ఆశలేదు వరమేమి అక్కరలేదు
గీతాపారాయణమే నా జీవిత లక్ష్యం అన్నాను "2"
నా ముద్దుమురిపాలన్నీ తీర్చేదాకా నీలోనన్నే
చేర్చేదాకా నీడల్లే నిన్నంటే వుంటాను "గోపాల"

Added by

Latha Velpula

SHARE

Comments are off this post