LYRIC

Pallavi:

Gundello udikudiki pongina lava

Pravahamuraa idi agaduraa…idi agaduraa

Manushulni ruchimarigi mattilo kalipina

Dahamuraa,naramedhamuraa..balidanamuraa

Srushti puttinappude tanuputti…brahma

kallalo karam kotti

Yerupu ranguto taratarala oka charitane rasindi

Rakta charitraraa…raktacharitraraa..

 

Charanam:1

Okate jananam okate maranam annadi shudda abaddam

Okkoka nimusham batukoka narakam annadi nitya satyam

Asuvuga manishini pashuvuni chese balamunnadiraa deeniki

Shishuvani chudaka shavamuni chese paishachikame deenidi

Jali dayalakika selavani antu jati bedhamulu chudanu antu

Erupu ranguto taratarala oka charitane rasindi

Rakta charitraraa…rakta charitraraa..

 

Charanam:2

Shakti undi yukti undi antuleni sattu vundi…

Lenidi siggu sharame

Durgunaanne sadgunamga chatukune nerpu vundi

marchuta kadu tarame

Kalu duvvinavu ante…katikaina tesukelle

Kalakuta vishame idile

Okkasari tagevante…vanda yellu undavante

Nukalu chellinatte

Snehanne natiyistu shatruvulaa chedistuu

Koradaane jhulipistuu mrutyuvulaa kabalistuu

Narakaanne talapistu…nalugurito moyistu..

Yerupuranguto oka charitane rasele..

Rakta charitraraa…rakta charitraraa

Telugu Transliteration

పల్లవి:

గుండెల్లో ఉడికుడికి పొంగిన లావ ప్రవాహమురా ఇది ఆగదురా...ఇది ఆగదురా
మనుషుల్ని రుచిమరిగి మట్టిలో కలిపిన దాహమురా,
నరమేధమురా..బలిదానమురా
సృష్టి పుట్టినప్పుడే తానుపుట్టి...బ్రహ్మ కళ్ళలో కారం కొట్టి
ఎరుపు రంగుతో తరతరాల ఒక చరితనే రాసింది
రక్త చరిత్రరా...రక్తచరిత్రరా..


చరణం:1

ఒకటే జననం ఒకటే మరణం అన్నది శుద్ధ అబద్దం
ఒక్కొక నిముషం బతుకొక నరకం అన్నది నిత్య సత్యం
ఆసువుగ మనిషిని పశువుని చేసే బలమున్నదిరా దీనికి
శిశువని చూడక శవముని చేసే పైశాచికమే దీనిది
జాలి దయలకిక సెలవని అంటూ జాతి బేధములు చూడను అంటూ
ఎరుపు రంగుతో తరతరాల ఒక చరితనే రాసింది
రక్త చరిత్రరా...రక్త చరిత్రరా..


చరణం:2

శక్తి ఉంది యుక్తి ఉంది అంతులేని సత్తు వుంది...లేనిది సిగ్గు శరమే
దుర్గుణాన్నే సద్గుణంగా చాటుకునే నేర్పు వుంది మార్చుట కాదు తరమే
కాలు దువ్వినావు అంటే...కాటికైన తీసుకెళ్ళే కాలకూట విషమే ఇదిలే
ఒక్కసారి తాగెవంటె...వంద ఏళ్ళు ఉండవంతే నూకలు చెల్లినట్టే
స్నేహన్నే నటియిస్తూ శత్రువులా చేదిస్తూ
కొరడానే ఝుళిపిస్తూ మృత్యువులా కబళిస్తూ
నరకాన్నే తలపిస్తూ...నలుగురితో మోయిస్తూ..
ఎరుపురంగుతో ఒక చరితనే రాసేలే..
రక్త చరిత్రరా...రక్త చరిత్రరా

SHARE