LYRIC
Pallavi:
Kalaganti kalaganti
ippuditu kalaganti
ellalokamulaku appadagu tiru venkataadreesuganti
//kalaganti//
Charanam:1
Atisayambaina seshaadhri sikharamuganti pratileni gopura prabhaluganti
satakoti suryatejamulu velugagaganti chaturaasyu podaganti chaturaasyu podaganti
chayyana melukonti
//kalaganti//
Charanam:2
Arudaina samkhachakraadu lirugadaganti
sarileni abhaya hastamunukanti
tiru venkataachaladhipuni choodagaganti
hariganti guruganti
hariganti guruganti
antata melukanti
//kalaganti//
Telugu Transliteration
పల్లవి:కలగంటి కలగంటి
ఇప్పుడిటు కలగంటి _ఎల్లలోకములకు
అప్పడగు తిరు వేంకటాద్రీశుగంటి
కలగంటి కలగంటి
ఇప్పుడిటు కలగంటి _ఎల్లలోకములకు
అప్పడగు తిరు వేంకటాద్రీశుగంటి
ఇప్పుడిటు కలగంటి
చరణం:1
అతిశయంబైన శేషాద్రి శిఖరముగంటి
ప్రతిలేని గోపుర ప్రభలుగంటి
శతకోటి సూర్యతేజములు వెలుగగగంటి
చతురాస్యు పొడగంటి
చతురాస్యు పొడగంటి _ చయ్యన మేలుకొంటి
చరణం:2
అరుదైన శంఖ చక్రాదు లిరుగడగంటి
సరిలేని అభయ హస్తమునుకంటి
తిరు వేంకటాచలధిపుని చూడగ గంటి
హరి గంటి గురు గంటి
హరి గంటి గురు గంటి అంతట మేలుకొంటి
కలగంటి కలగంటి
ఇప్పుడిటు కలగంటి _ఎల్లలోకములకు
అప్పడగు తిరు వేంకటాద్రీశుగంటి
ఇప్పుడిటు కలగంటి
ఇప్పుడిటు కలగంటి
Added by
Comments are off this post