LYRIC

Pallavi:

Om om- 2
Telugu padaneekee janmadeenam
edee jana padaneekee jnanapadam
edoo swarale edoo kondalaee velaseena kaleeyooga veeshnoo padam
anamaya jananam
edee anamaya jananam
edee anamaya jananam

 

Charanam:1

Areeshadvargamoo teganareeke hareekhadgamedee nandakamoo
brahmalokamoona brahmabharatee nadaseessooloo pondeenadaee
seevalokamoona cheedveelasamoona damaroodhvaneelo gamakeetamaee
deevyasabhalalo navyalasyamoola poobantoola chebanteega egasee
neerada mandala narada toomboora mahatee ganavoo maheemaloo teleesee
seetaheema kamdara yateeratsabhalo tapaha phalamooga talookoomanee
talee tanamookaee taladeeloo a lakka mamba garbhalayamoolo
praveseenche anandakamoo nandanananda karakamoo
anamaya jananam
edee anamaya jananam
edee anamaya jananam

 

Charanam:2

Padmavateeye pooroodoo poyaga padhmasanoode oosooroo poyaga
veeshnoo tejamaee nada beejamaee andhra saheetee amara kosamaee
avatareenchenoo anamaya asatoma sadgamaya
avatareenchenoo anamaya asatoma sadgamaya

 

Charanam:3

Papadooga nateenta pakootoo bhagavatamoo cheppatenaya
hareenamamoonoo alakeenchaka aramooddalane mootadaya
telugu bharateekee veloogoo harataee edalayalo pada kaveetaloo kalaya
talapakalo edeege anamaya tamasoma jyoteergamaya
tamasoma jyoteergamaya
tamasoma jyoteergamaya

Telugu Transliteration

పల్లవి:

ఓం... ఓం..
తెలుగు పదానికి జన్మదినం ఇది జానపదానికి జ్నానపథం
ఏడు స్వరాలే ఏడు కొండలై
వెలసిన కలియుగ విష్ణు పదం
అన్నమయ్య జననం... ఇది అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం


చరణం:1

అరిషడ్వర్గము తెగనరికే హరిఖడ్గమ్మిది నందకము
బ్రహ్మలోకమున బ్రహ్మాభారతి
నాదాశిస్సులు పొందినదై
శివలోకమున చిద్విలాసమున
డమరుధ్వనిలో గమకితమై
దివ్యసభలలో నవ్య నాట్యముల
పూబంతుల చేమంతిగ ఎగసి
నీరద మండల నారద తుంబుర
మహతీ గానవు మహిమలు తెలిసి
స్థిత హిమకందుర యతిరాట్ స్సభలో
తప: ఫలమ్ముగ తళుకుమని
ఓం...
తల్లి తనముకై తల్లడిల్లు ఆ లక్క మాంబ గర్భాలయమ్ములో
ప్రవేశించె ఆ నందకము
నందనానంద కారకము
అన్నమయ్య జననం... ఇది అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం


చరణం:2

పద్మావతియే పురుడు పోయగా
పద్మాసనుడే ఉసురు పోయగా
విష్ణు తేజమై నాద బీజమై
ఆంధ్ర సాహితీ అమర కోశమై
అవతరించెను అన్నమయ్య
అసతోమా సద్గమయ
అవతరించెను అన్నమయ్య
అసతోమా సద్గమయ


చరణం:3

పాపడుగా నట్టింట పాకుతూ భాగవతము చేపట్టెనయా
హరినామమ్మును ఆలకించక అరముద్దలనే ముట్టడయా
తెలుగు భారతికి వెలుగు హారతై
ఎదలయలో పద కవితలు కలయ
తాళ్ళపాకలో ఎదిగే అన్నమయ్య
తమసోమా జ్యోతిర్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
తమసోమా జ్యోతిర్గమయ

SHARE

Comments are off this post