LYRIC
Pallavi:
Kattulato savasam nettutito samaptam
kakshala ee samaram..katikiraa payanam
ee mulla darullo migiledi shunyam nijam
Charanam:1
Viluvaina batuku velalenidaite marananni pujincharaa
pudutune evadu pagavadu kadu poyinodu kudaa raa
ee nadumana nuvvu vidhi aatalona pavuvaite vodevuraa
Charanam:2
Paga annadepudu yemiche nestam nashtaanne migilinchuraa
kshanakalamaina manashanti leni batukenta baruvavvuraa
batikenduke ee batukundani chachaka telisemiraa
Telugu Transliteration
పల్లవి:కత్తులతో సావాసం నెత్తుటితో సమాప్తం
కక్షల ఈ సమరం..కాటికిరా పయనం
ఈ ముళ్ళ దారుల్లో మిగిలేది శూన్యం నిజం
చరణం:1
విలువైన బతుకు వెలలేనిదైతే మరణాన్ని పూజించరా
పుడుతూనే ఎవడు పగవాడు కాడు పోయినోడు కూడా రా
ఈ నడుమన నువ్వు విధి ఆటలోన పావువైతే ఓడేవురా
చరణం:2
పగ అన్నదెపుడూ ఏమిచ్చె నేస్తం నష్టాన్నే మిగిలించురా
క్షణకాలమైన మనశ్శాంతి లేని బతుకెంత బరువవ్వురా
బతికేందుకే ఈ బతుకుందని చచ్చాక తెలిసేమిరా