LYRIC
Pallavi:
Nuvve na swaasa..manasuna neekai abhilasha..
bratukaina neetone..chitikaina neetone..
vetikedi ney ninnenani cheppalani chinni aasa..
oo priyatama..//2// //nuvve na swaasa//
Charanam:1
Puuvullo parimalaanni parichayame chesavu..
taaralalo merupulanni dosililo nimpaavu..
mabbulona chinukulanni,manasulona kuripinchaavu..
navvullo navalokaanni na munde nilipinaavuga..
ne gnapakaalanni..ye janmalonaina..
ney maravalenani neto cheppalani chinni aasa..
oo priyatama//2// //nuvve na swaasa//
Charanam:2
Suryunito pamputunna..anuraagapu kiranaanni..
gaalulato pamputunna..aaraadhana raagaanni..
yerulato pamputunna..aaraatapu pravahanni..
daarulato pampistunna..aluperugani,hrudayalayalani..
ye chota nuvvunna,ne koraku chuustunna..
na prema sandesam vini vastaavani chinni aasa..
oo priyatama//2//
Nuvve na swaasa..manasuna neekai abhilasha..
bratukaina neetone..chitikaina neetone..
vetikedi ney ninnenani cheppalani chinni aasa..
oo priyatama..//2// //nuvve na swaasa//
Telugu Transliteration
పల్లవి:నువ్వే నా శ్వాస..మనసున నీకై అభిలాష..
బ్రతుకైనా నీతోనే..చితికైనా నీతోనే..
వెతికేది నే నిన్నేనని చెప్పాలని చిన్ని ఆశ..
ఓ ప్రియతమా..(2)(నువ్వే నా శ్వాస)
చరణం:1
పూవుల్లో పరిమళాన్ని పరిచయమే చేసావు..
తారలలో మెరుపులన్ని దోసిలిలో నింపావు..
మబ్బులోన చినుకులన్ని,మనసులోన కురిపించావు..
నవ్వుల్లో నవలోకాన్ని నా ముందే నిలిపినావుగా..
నీ జ్ఞాపకాలన్నీ..ఏ జన్మలోనైన..
నీ మరవలేనని నీతో చెప్పాలని చిన్ని ఆశ..
ఓ ప్రియతమా(2)(నువ్వే నా శ్వాస)
చరణం:2
సూర్యునితో పంపుతున్నా..అనురాగపు కిరణాన్ని..
గాలులతో పంపుతున్నా..ఆరాధన రాగాన్ని..
ఏరులతో పంపుతున్నా..ఆరాటపు ప్రవాహాన్ని..
దారులతో పంపిస్తున్నా..అలుపెరుగని,హృదయలయలని..
ఏ చోట నువ్వున్నా,నీ కొరకు చూస్తున్నా..
నా ప్రేమ సందేశం విని వస్తావని చిన్ని ఆశ..
ఓ ప్రియతమా(2)