LYRIC

Pallavi:      

Taguna edi mama tamare itu balka naguna

taguna idi mama

nigama margamulu telisina nive itulanadaguna…

taguna idi mama

alludanaganevadu mi ammayiki magadu     //alludanaga//

nivu kallu kadigi kanyadanamu cesina ganudu

a ganuni mida aluka buna etiki citiki matiki

taguna idi mama tamare itu balka naguna

taguna idi mama

popora pommikan na gruhammunaku bojanammunaku

ika ra valadu ra tagadu chi po popora pommikan

arere entati mosagadavura nake topi vesinavura

arere entati mosagadavura nake topi vesinavura

ni sahasamu parihasamu ni  sahasamu parihasamu

nirbagyula toti sahavasamu

sahimcanu kshamimcanu yocimcanu ni matan

vaccina batan pattumu vegan popora pommikan

popora pommikan na gruhammunaku bojanammunaku

ika ra valadu ra tagadu ci po po

kodukulu lenamduku tala korivi bettuvadane

niku korivi bettuvadane dairektuga

svarganiki citi niccuvadane talli leni pilla usuru

tagalade omtiga umcaga taguna idi mama!

are  urikella monagadine        //urikella //

pedda millu kella yajamanine ni dabusari bale bittari

ni dabusari bale bittari nijamenani nammiti pokiri

duratmuda dushtatmuda garvatmuda nicuda

ipude telisen ni katha ellan popora pommikan

popora pommikan na gruhammunaku bojanammunaku

ika ra valadu ra tagadu ci po po

 

Telugu Transliteration

పల్లవి:
తగునా ఇది మామా! తమరే ఇటు బల్క నగున
తగునా ఇది మామా!
నిగమ మార్గములు తెలిసిన నీవే ఇటులనదగునా...
తగునా ఇది మామా!
అల్లుడనగనెవడు మీ అమ్మాయికి మగడూ ||అల్లుడనగ||
నీవు కాళ్ళు కడిగి కన్యాదానము చేసిన ఘనుడు
ఆ ఘనుని మీద అలుక బూన ఏటికి చీటికి మాటికి
తగునా ఇది మామా! తమరే ఇటు బల్క నగున
తగునా ఇది మామా!
ఫోఫోర ఫొమ్మికన్ నా గృహమ్మునకు భోజనమ్మునకు
ఇక రా వలదు రా తగదు చీ పో ఫోఫోర ఫొమ్మికన్
అరెరే ఎంతటి మోసగాడవుర నాకే టోపీ వేసినావుర
అరెరే ఎంతటి మోసగాడవుర నాకే టోపీ వేసినావుర
నీ సాహసము పరీహాసము నీ సాహసము పరీహాసము
నిర్భాగ్యుల తోటి సహవాసము
సహించను క్షమించను యోచించను నీ మాటన్
వచ్చిన బాటన్ పట్టుము వేగన్ ఫోఫోర ఫొమ్మికన్
ఫోఫోర ఫొమ్మికన్ నా గృహమ్మునకు భోజనమ్మునకు
ఇక రా వలదు రా తగదు చీ ఫో ఫో
కొడుకులు లేనందుకు తల కొరివి బెట్టువాడనే
నీకు కొరివి బెట్టువాడనే డైరెక్టుగ
స్వర్గానికి చీటి నిచ్చువాడనే తల్లి లేని పిల్ల ఉసురు
తగలదె ఒంటిగ ఉంచగ తగునా ఇది మామా!
అరె ఊరికెల్ల మొనగాడినే ||ఊరికెల్ల ||
పెద్ద మిల్లు కెల్ల యజమానినే నీ డాబూసరి బలే బిత్తరి
నీ డాబూసరి బలే బిత్తరి నిజమేనని నమ్మితి పోకిరి
దురాత్ముడ దుష్టాత్ముడ గర్వాత్ముడ నీచుడా
ఇపుడె తెలిసెన్ నీ కథ ఎల్లన్ ఫోఫోర ఫొమ్మికన్
ఫోఫోర ఫొమ్మికన్ నా గృహమ్మునకు భోజనమ్మునకు
ఇక రా వలదు రా తగదు చీ ఫో ఫో

Added by

Latha Velpula

SHARE

Comments are off this post