LYRIC
Pallavi:
Tetateta telugulaa tellavari velugulaa
terulaa selayerulaa kalakalaa galagalaaa
kadali vachindi kanne apsara
vachi nilichindi kanula mundara
Charanam:1
Teluguvari adapaduchu yenkilaa
yenki koppuloni muddabanti puvvulaa
godaari keratala geetalavale
nalo palikinadi palikinadi palikinadi
challagaa chirujallugaa
jalajalaa galagalaa
kadali vachindi kanne apsara
vachi nilichindi kanula mundara
Charanam:2
Rekkalochi uhalanni yegurutunnavi
prema mandiranni chukkalato chekkutunnavi
lolona nalona yennenno rupalu
velisinavi velisinavi velisinavi
veenalaa nerajanalaa
kalakalaa galagalaa
kadali vachindi kanne apsara
vachi nilichindi kanula mundara
Telugu Transliteration
పల్లవి:తేటతేట తెలుగులా తెల్లవారి వెలుగులా
తేరులా సెలయేరులా కలకలా గలగలా
కదలి వచ్చింది కన్నె అప్సర
వచ్చి నిలిచింది కనుల ముందర
చరణం:1
తెలుగువారి ఆడపడుచు ఎంకిలా
ఎంకి కొప్పులోని ముద్దబంతి పువ్వులా
గోదారి కెరటాల గీతాలవలె
నాలో పలికినది పలికినది పలికినది
చల్లగా చిరుజల్లుగా
జలజలా గలగలా
కదలి వచ్చింది కన్నె అప్సర
వచ్చి నిలిచింది కనుల ముందర
చరణం:2
రెక్కలొచ్చి ఊహలన్ని ఎగురుతున్నవి
ప్రేమ మందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి
లోలోన నాలోన ఎన్నెన్నో రూపాలు
వెలిసినవి వెలిసినవి వెలిసినవి
వీణలా నెరజాణలా
కలకలా గలగలా
కదలి వచ్చింది కన్నె అప్సర
వచ్చి నిలిచింది కనుల ముందర