LYRIC

Pallavi :
aadakooturaa, neeku adugaduguna vandanam
anunityam karugutunna neevu raktachandanam
aadakooturaa, neeku adugaduguna vandanam
anunityam karugutunna neevu raktachandanam
aa aa aa aa aa aa aa aa aa
aa aa aa aa aa aa aa aa aa

Charanam : 1
maharaajule .. Magaallu andaru
tellavaarinaa .. Nidura levaru
kantininda kunuku .. Kanaledu neeveppudu
sagamu niduralone .. Ninulepenu cheepuru
magabiddala yogamemito .. Levagaane bhogamemito
egataaliga ninnegani navve paachi ginnelu

Aadakooturaa neeku adugaduguna vandanam
anunityam karugutunna neevu raktachandanam

Charanam : 2
bandachaakiri rebavalu chesinaa .. Gunde baruvani nee peru pettiri
padahaarava eta .. Ika modalu varudi veta
nee baruvu dinchukovadame .. Tallidandri muchchata
putaka nundi chaavu madhyanaa .. Batukunanta aragadeesinaa
e jeetamu e selavu erugani oka daasivi

Aadakooturaa neeku adugaduguna vandanam
anunityam karugutunna neevu raktachandanam

Charanam : 3
pellipeetapai .. Kanthaanni mudesi
naaticharaami .. Antaadu ottesi
akshintalatone .. Mantraalu nelapaalu
marunaati nunde .. Nee batuku bootu kaalu
intiki deepam illaalu..oo oo
attamaama kaadante cheekati paalu
magavaade nee nosatana raase manuvu raatale

Aadakooturaa neeku adugaduguna vandanam
anunityam karugutunna neevu raktachandanam

Telugu Transliteration

పల్లవి :
ఆడకూతురా, నీకు అడుగడుగున వందనం
అనునిత్యం కరుగుతున్న నీవు రక్తచందనం
ఆడకూతురా, నీకు అడుగడుగున వందనం
అనునిత్యం కరుగుతున్న నీవు రక్తచందనం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

చరణం : 1
మహరాజులే .. మగాళ్లు అందరు
తెల్లవారినా .. నిదుర లేవరు
కంటినిండ కునుకు .. కనలేదు నీవెప్పుడు
సగము నిదురలోనే .. నినులేపేను చీపురు
మగబిడ్డల యోగమేమిటో .. లేవగానే భోగమేమిటో
ఎగతాళిగ నిన్నేగని నవ్వే పాచి గిన్నెలు

ఆడకూతురా నీకు అడుగడుగున వందనం
అనునిత్యం కరుగుతున్న నీవు రక్తచందనం

చరణం : 2
బండచాకిరి రేబవలు చేసినా .. గుండె బరువని నీ పేరు పెట్టిరి
పదహారవ ఏట .. ఇక మొదలు వరుడి వేట
నీ బరువు దించుకోవడమే .. తల్లిదండ్రి ముచ్చట
పుటక నుండి చావు మధ్యనా .. బతుకునంత అరగదీసినా
ఏ జీతము ఏ సెలవు ఎరుగని ఒక దాసివి

ఆడకూతురా నీకు అడుగడుగున వందనం
అనునిత్యం కరుగుతున్న నీవు రక్తచందనం

చరణం : 3
పెళ్లిపీటపై .. కంఠాన్ని ముడేసి
నాతిచరామి .. అంటాడు ఒట్టేసి
అక్షింతలతోనే .. మంత్రాలు నేలపాలు
మరునాటి నుండే .. నీ బతుకు బూటు కాలు
ఇంటికి దీపం ఇల్లాలు..ఊ ఊ
అత్తమామ కాదంటే చీకటి పాలు
మగవాడే నీ నొసటన రాసే మనువు రాతలే

ఆడకూతురా నీకు అడుగడుగున వందనం
అనునిత్యం కరుగుతున్న నీవు రక్తచందనం

Added by

Meghamala K

SHARE

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x