LYRIC

andamaa ne peremiti andamaa
andamaa ne peremiti andamaa
vompula hampi shilpama
bapu geesina chitramaa
telupumaa telupumaa telupumaa
paruvamaa ne vuremiti paruvamaa
paruvamaa ne vuremiti paruvamaa
krishnuni madhuraa nagaramaa
krishna sagara keratamaa
telupumaa telupumaa telupumaa

ye ravindruni bhavamo geetanjali kala vivarinche
yenda takani pandu vennela gaganamolike na kannula
yenki patala ragame godari alalapai nidurinche
mugaboyina ragamalika musirenipudu na gontuna
sangeetamaa ne ningiloo
virisiina swaramule yedugaa vinabadu harivillekkada
telupumaa telupumaa telupumaa

bhavakavitala baruvulo aa krishnashastrila kavinaite
hayi remmala koyilammaku virula rutuvu vikasinchada
tummedadagani madhuvule cheli saki valapule chilikiste
maya jagatiki ye khayamo madhura kavita vinipinchadaa
oo kavyamaa ne totalo navarasa poshane galiga
navvina pule malagaa pujake sadhyamaa telupumaa

Telugu Transliteration

పల్లవి:
అందమా... నీ పేరేమిటి అందమా...
అందమా... నీ పేరేమిటి అందమా...
ఒంపుల హంపీ శిల్పమా బాపూ గీసిన చిత్రమా
తెలుపుమా.. తెలుపుమా.. తెలుపుమా....

పరువమా... నీ ఊరేమిటి పరువమా...
పరువమా... నీ ఊరేమిటి పరువమా...
కృష్ణుని మధురానగరమా కృష్ణాసాగర కెరటమా
తెలుపుమా.. తెలుపుమా.. తెలుపుమా....
చరణం 1:
ఆ... ఆహ ఆహ ఆహాహహహా....
ఆ... ఆహ ఆహ ఆహాహహహా....

ఏ...రవీంద్రుని భావమో గీతాంజలీ కళ వివరించె
ఎండ తాకని పండువెన్నెల గగనమొలికె నాకన్నులా
ఎంకిపాటల రాగమే గోదారి అలలపై నిదురించే
మూగబోయిన రాగమాలిక ముసిరెనిపుడు నా గొంతునా
సంగీతమా ఆ ఆ....
ఈ నింగిలో ఓ ఓ....

విరిసిన స్వరములే ఏడుగా...
వినబడు హరివిల్లెక్కడా...
తెలుపుమా.. తెలుపుమా.. తెలుపుమా....

అందమా... నీ పేరేమిటి అందమా...
తెలుపుమా...నీ ఊరేమిటి పరువమా...
చరణం 2:
భావకవితల బరువులో ఆ కృష్ణశాస్త్రిలా కవినైతే
హాయిరెమ్మల కోయిలమ్మకు విరుల ఋతువు వికసించదా
తుమ్మెదడగని మధువులే చెలిసాకి వలపులే చిలికిస్తే
మాయజగతికి ఏఖయామో మధురకవిత వినిపించడా
ఓ కావ్యమా... ఆ ఆ...
ఈ తోటలో.... ఓ ఓ ...

నవరసపోషణే గాలిగా...
నవ్వినపూలే మాలగా...
పూజకే... సాధ్యమా...తెలుపుమా

అందమా... నీ పేరేమిటి అందమా...
అందమా... నీ పేరేమిటి అందమా...
ఒంపుల హంపీ శిల్పమా బాపూ గీసిన చిత్రమా
తెలుపుమా.. తెలుపుమా.. తెలుపుమా....

SHARE

VIDEO