LYRIC

chemma chekka chemma chekka……..
chemma chekka chemma chekka chemantuloy
chempa chukka chempa chukka sampengaloy
kanne bugga kanne bugga kavvintaloy
siggu mogga siggu mogga tullintaloy
saradaala sangeetamto chelaregindi sannayi
baruvaina santoshamto talavanchindi ammayi pellisandallalo
uru vada vachi eedu jodu mechi sambaramga chustaranta
kanna varu vachi kanne danamichi kantaneeru pedataranta
tadi kalle pramidhaluga velige pandirilona
paravalle andeluga aade anandaana
pitta kuta panche kattukundi mantraalu vallistu
pilla gali pelli peddayyindi panneeru challistu
pelli sandallalo
pattu cheera katti pula jada chutti kotta kala murise vela
vana villu vanti jana vannelanti veyyi kallu merise vela
niluvellaa virisindi pulakintala pudota
virimulle visirindi puri vippina sayyata
aada janma melukundi chudu sarikotta rupamto
angaranga vaibhavamga nedu jaripinchu vedukato
pelli sandallalo

Telugu Transliteration

చెమ్మ చెక్క చెమ్మ చెక్క........

చెమ్మ చెక్క చెమ్మ చెక్క చేమంతులోయ్
చెంప చుక్క చెంప చుక్క సంపెంగలోయ్
కన్నె బుగ్గ కన్నె బుగ్గ కవ్వింతలోయ్
సిగ్గు మొగ్గ సిగ్గు మొగ్గ తుళ్ళింతలోయ్
సరదాల సంగీతంతో చెలరేగింది సన్నాయి
బరువైన సంతోషంతో తలవంచింది అమ్మాయి పెళ్ళిసందళ్ళలో

ఊరు వాడ వచ్చి ఈడు జోడు మెచ్చి సంబరంగా చూస్తారంట
కన్న వారు వచ్చి కన్నె దానమిచ్చి కంటనీరు పెడతారంట
తడి కళ్ళే ప్రమిధలుగా వెలిగే పందిరిలోన
పరవళ్ళే అందెలుగా ఆడే అనందాన
పిట్ట కూత పంచె కట్టుకుంది మంత్రాలు వల్లిస్తూ
పిల్ల గాలి పెళ్లి పెద్దయ్యింది పన్నీరు చల్లిస్తూ
పెళ్లి సందళ్ళలో

పట్టు చీర కట్టి పూల జడ చుట్టి కొత్త కళ మురిసే వేళ
వాన విల్లు వంటి జాణ వన్నెలంటి వెయ్యి కళ్ళు మెరిసే వేళ
నిలువెల్లా విరిసింది పులకింతల పూదోట
విరిముళ్ళే విసిరింది పురి విప్పిన సయ్యాట
ఆడ జన్మ మేలుకుంది చూడు సరికొత్త రూపంతో
అంగరంగ వైభవంగ నేడు జరిపించు వేడుకతో
పెళ్లి సందళ్ళలో

SHARE

VIDEO