LYRIC

Pallavi:

Chukkallokekkinadu chakkanodu

Talladillipotumdi talli annadi

Pade ettatanike snehamunnadi

 

Charanam:

Poyinodu yika radu

Evadikevadu todu

Nuvvu tinna mannera ninnu tinnadi

Cavu bratukulannavi adukumtavi

Eppatiki evvariki cikkanodu //2//

Botturalcukumtumdi kattukunnadi

Korivi pettadanike koduku vunnadi   //chukkallo//

Unnavadu poyinodi gurutu niluputadu

Kannillaku kattekuda aranannadi

Cavuleni snehame toduvumtadi… // chukkallo//

 

Telugu Transliteration

పల్లవి:

చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు
తల్లడిల్లిపోతుంది తల్లి అన్నదీ
పాడె ఎత్తటానికే స్నేహమున్నదీ


చరణం:

పోయినోడు యిక రాడు
ఎవడికెవడు తోడు
నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నదీ
చావు బ్రతుకులన్నవి ఆడుకుంటవీ
ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు (౨)
బొట్టురాల్చుకుంటుందీ కట్టుకున్నదీ
కొరివి పెట్టడానికే కొడుకు వున్నదీ ||చుక్కల్లో||
ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు
కన్నీళ్లకు కట్టేకుడ ఆరనన్నదీ
చావులేని స్నేహమే తోడువుంటదీ... || చుక్కల్లో||

Added by

Meghamala K

SHARE

Comments are off this post