LYRIC
chuttupakkala choodara chinnavada!
chukkallo choopu chikkukunnavaada
kallamundu katika nijam
kanaleni guddi japam
sadhinchadu ye paramartham
bratukunu kaaneeyaku vyardham
swargalanu andukonalani wadiga gudi metlekkevu
saati manishi vedana choostu jaalileni shilavainavu
karunanu maripincheda chaduvu samskaram ante
gundae bandaga maarcheda sampradayamante
nuvvu tine prati oka matuku ee sangham pandinchindi
garvinche ee nee bratuku samaajame malichindi
runam teerchu tarunam vaste tappinchuku potunnava
teppa tagalapettestava yeru datagane
Telugu Transliteration
చుట్టుపక్కల చూడరా చిన్నవాడ!
చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడ
కళ్ళముందు కటిక నిజం
కానలేని గుడ్డి జపం
సాధించదు ఏ పరమార్ధం
బ్రతుకును కానీయకు వ్యర్ధం
స్వర్గాలను అందుకొనాలని వడిగా గుడి మెట్లెక్కేవు
సాటి మనిషి వేదన చూస్తు జాలిలేని శిలవైనావు
కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే
గుండె బండగా మార్చేదా సంప్రదాయమంటే
నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది
గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది
ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా
తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే
Added by