LYRIC

Pallavi:

Gudilo emumdi babu  badilone umdi
bukti sakti kavalamte
manava seva ceyyalamte        ||gudi||
devudi perita dopidi cese
dalarulemdaro perigaru
mukti mattulo baktula mumci
sarvam bomcestunnaru
noruleni a devudu papam
norugari potunnadu            ||gudilo|

caduvula perita gumastalanu tayaru cestu vunnaru
prabuvullaga bratikevallanu banisaluga cestunnaru
udyogalaku vetaladamani ulla paiki tolestunnaru

cadavaka pote manishi rivvuna camdruni paiki
egire vada  gira gira tirigi vaccevada ?
Devudu callaga cudakapote akkade
gallamtai poda  anavalu cikkevada ?
Caduvula saram hariyani
harikuda cadavalani
caduvula marmam hariyani
a hariki guruvumdalani
hariye sarvasvammani
caduve sarvasvammani
haribaktudu prahladudu munupe ballaguddi ceppadu
a hariye sri krushnuduga vacci
badilo kurcuni cadivadu
yi badilo kurcuni cadivadu
cadivadu cadivadu cadivadu

Telugu Transliteration

పల్లవి:

గుడిలో ఏముందీ బాబూ - బడిలోనే ఉంది
భుక్తి శక్తి కావాలంటే
మానవ సేవ చెయ్యాలంటే ||గుడి||
దేవుడి పేరిట దోపిడి చేసే
దళారులెందరో పెరిగారూ
ముక్తి మత్తులో భక్తుల ముంచీ
సర్వం భోంచేస్తున్నారూ
నోరులేని ఆ దేవుడు పాపం
నోరుగారి పోతున్నాడూ ||గుడిలో||
చదువుల పేరిట గుమాస్తాలనూ - తయారు చేస్తూ వున్నారు
ప్రభువుల్లాగా బ్రతికేవాళ్ళను - బానిసలుగ చేస్తున్నారు
ఉద్యోగాలకు వేటలాడమని - ఊళ్ల పైకి తోలేస్తున్నారు
చదవక పోతే మనిషి రివ్వునా - చంద్రుని పైకి
ఎగిరే వాడా ? గిర గిర తిరిగి వచ్చేవాడా ?
దేవుడు చల్లగ చూడకపోతే అక్కడె
గల్లంతై పోడా - ఆనవాలు చిక్కేవాడా ?
చదువుల సారం హరియని
హరికూడా చదవాలని
చదువుల మర్మం హరియని
ఆ హరికీ గురువుండాలనీ
హరియే సర్వస్వమ్మని
చదువే సర్వస్వమ్మనీ
హరిభక్తుడు ప్రహ్లాదుడు మునుపే బల్లగుద్ది చెప్పాడు
ఆ హరియే శ్రీ కృష్ణుడుగా వచ్చీ
బడిలో కూర్చుని చదివాడు
యీ బడిలో కూర్చుని చదివాడు
చదివాడూ చదివాడూ చదివాడూ



Added by

Latha Velpula

SHARE

Comments are off this post