LYRIC

pallavi:

Saa ni sa ri saani aaa ha aaa
saa ni sa ma gaa mari aaa
pa da saa ni sa ri saani aaa ha aaa
saa ni sama gaa mari aaaa
pa da sasa ni riri sa gaga gari mama gaga maaa
saa ni da pa ma ga ri sa ni

Keeravaani….
chilakala kolikiro paadaveme…
valapule telupaga
virabusina aasalu
viritenalu challaga…
alarulu kurisina ruthuvula tadisina madhurasa vaani… keeravaani
chilakala kolikiro paadaveme
valapule telupagaa……

 

charanam:1

Ga ri sa pa ma ga pa ni…
sa ri ga ri ga sa.. nisa…
ee poolalo andamai
ee gaalilo gandhamai
naa thotalo chaitramai
ee batane nadachira
nee gaganalalo ne chiru taaranai
nee adharaalalo ne chirunavvunai
swarame layagaa mugisey….
salalita kalarutha swaranutha gathiyuta gamakamu telayakane
keeravaani
chilakala kala kala
paadaledhu valapule
telupagaa ila raalina puvvulu..
vedajallina taavula..
alikidi erugani pilupula aligina manjulavaani….keeravaani
chilakala kala kala paadaledhu
valapule telupagaa…..

 

charanam:2

Nee kannulaa neelamai
nee navvulaa vennalai
sampengalaa gaalinai
taaraadanaa needanai
nee pavanalalo ne tholi praasanai
nee javanaalalo jaajula vaasanai
yedalo edhale kadile..
paduchula manasulu panjara sukhamula palukulu theliyakane
keeravaani..
chilakala kalakala paadaledhu
valapule thelupaga
virabusina aasalu
virithenalu challaga..
alarulu kurisina ruthuvula tadisina madhurasavaani..
keeravaani…
chilakala kolikiro paadaveme
valapule telupagaa….

Telugu Transliteration

పల్లవి:

సా...నిసరిసాని...సా నిసమగామరి
పదసా..నిసరీసాని...
సా..నిసమగామరి
పదసససని రిరిరిస గగగరి
మమమగ పా...
సా ని ద ప మ గ రి స ని..

కీరవాణి...చిలకలా హొలికెరు పాడవేమే
వలపులే తెలుపగా విరబూసిన ఆశలు
విరితేనెలు చల్లగ అలరులు కురిసిన
ఋతువుల తడిసిన మధురసవాణి
కీరవాణి.....
చిలకలాహొలికెరు పాడవేమే
వలపులే తెలుపగా....


చరణం:1

గరిస పమగ పాని సరిగ రిగస నీద..
ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై
నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా
నీ గగనాలలో నే చిరుతారనై
నీ అధరాలలో నే చిరునవ్వునై
స్వరమే లయగా ముగిసే..
సలలిత కలరుత స్వరనుత గతియుత
గమకము తెలియకనే....
కీరవాణి చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా
ఇలరాలిన పూవులు వెదజల్లిన తావుల
అలికిడి ఎరుగని పిలుపుల
అలిగిన మంజులవాణి
కీరవాణి..... చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా.....


చరణం:2

నీ కన్నులా నీలమై నీ నవ్వులా వెన్నెలై
సంపెంగలా గాలినై తారాడనా నీడనై
నీ కవనాలలో నే తొలి ప్రాసనై
నీ జవనాలలో జాజుల వాసనై
ఎదలో ఎదలే కదిలే
పడచుల మనసుల పంజర శుకముల
పలుకులు తెలియకనే
కీరవాణి చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా
విరితేనెలు చల్లగ అలరులు కురిసిన
ఋతువుల తడిసిన మధురసవాణి
కీరవాణి.....
చిలకలాహొలికెరు పాడవేమే
వలపులే తెలుపగా....

Added by

Meghamala K

SHARE