LYRIC

Pallavi:      

kumar: Mavuru madarasu, na peru rambabu        ||2||

kammani ni poju kavvimce i roju            ||2||

madanapadi manasu cedi vaccane ammayi

mavuru madarasu, na peru rambabu

hema:mavuru bombayi, na peru radhabayi    ||2||

emiti ni badha e matram ni hoda        ||2||

a vishayam a vivaram ceppavoyi abbayi

mavuru bombayi, na peru radhabayi

 

 charanam:1

kumar:rodlamida karlunnay… Byamkulo dabbulunnay   //2//

devidiccina kallunnay… Cuddaniki kallunnay

mana bimkam mana pomkam telisimda ammayi

mavuru madarasu, na peru rambabu

hema:kyadilak karumda nyu modal medumda        ||2||

intimumdu vyanumda nidurabonu pyanumda

kapilaku sinimalaku karuvemi ledu kada

mavuru bombayi, na peru radhabayi

kumar:mavuru madarasu, na peru rambabu

 

 charanam:2

vuru tiraga bassumdi pabam… Pabam..

vumdanu plat paramumdi hi.. Hi..         ||vuru tiraga||

kadupu nimda niru traga karporeshan tapumdi

emunna… Lekunna…     Emunna lekunna

minnayainadokatumdi… Minnayainadokatumdi

hema:emumdi

kumar:premimce hrudayamumdi

hema ade naku kavali… Itade nannu elali        ||ade||

kumar:abbayini ammayini iddarini kanali        ||2||

kumar, hema:    hayiga tapiga..    Hayiga tapiga..

bratuku parugu tiyali… Bratuku parugu tiyali

kumar: mavuru madarasu, na peru rambabu

hema:mavuru bombayi, na peru radhabayi

Telugu Transliteration

పల్లవి:

కుమార్: మావూరు మదరాసు, నా పేరు రాంబాబు ||2||
కమ్మని నీ పోజు కవ్వించే ఈ రోజు ||2||
మదనపడి మనసు చెడి వచ్చానె అమ్మాయి
మావూరు మదరాసు, నా పేరు రాంబాబు
హేమ: మావూరు బొంబాయి, నా పేరు రాధాబాయి ||2||
ఏమిటి నీ బాధ ఏ మాత్రం నీ హోదా ||2||
ఆ విషయం ఆ వివరం చెప్పవోయి అబ్బాయి
మావూరు బొంబాయి, నా పేరు రాధాబాయి


చరణం:1

కుమార్: రోడ్లమీద కార్లున్నాయ్... బ్యాంకులొ డబ్బులున్నాయ్ ||2||
దేవిడిచ్చిన కాళ్ళున్నాయ్... చూడ్డానికి కళ్ళున్నాయ్
మన బింకం మన పొంకం తెలిసిందా అమ్మయి
మావూరు మదరాసు, నా పేరు రాంబాబు
హేమ: క్యాడిలాక్ కారుందా? న్యూ మోడల్ మేడుందా ? ||2||
ఇంటిముందు వ్యానుందా? నిదురబోను ఫ్యానుందా?
కాఫీలకు సినిమాలకు కరువేమీ లేదు కదా?
మావూరు బొంబాయి, నా పేరు రాధాబాయి
కుమార్: మావూరు మదరాసు, నా పేరు రాంబాబు



చరణం:2

వూరు తిరగ బస్సుంది పబాం... పబాం..
వుండను ఫ్లాట్ ఫారముంది హి.. హి.. ||వూరు తిరగ||
కడుపు నిండా నీరు త్రాగ కార్పొరేషన్ టాపుంది
ఏమున్నా... లేకున్నా... ఏమున్నా లేకున్నా
మిన్నయైనదొకటుంది... మిన్నయైనదొకటుంది
హేమ: ఏముంది ?
కుమార్: ప్రేమించే హృదయముంది
హేమ: అదే నాకు కావాలి... ఇతడె నన్ను ఏలాలి ||అదే||
కుమార్: అబ్బాయిని అమ్మాయిని ఇద్దరినీ కనాలి ||2||
కుమార్, హేమ: హాయిగా తాపీగా.. హాయిగా తాపీగా..
బ్రతుకు పరుగు తీయాలి... బ్రతుకు పరుగు తీయాలి
కుమార్: మావూరు మదరాసు, నా పేరు రాంబాబు
హేమ: మావూరు బొంబాయి, నా పేరు రాధాబాయి

Added by

Latha Velpula

SHARE

Comments are off this post