LYRIC
Pallavi:
Nidurinche totaloki paata okati vachindi
kannullo neeru tudichi kammati kala vachindi
Charanam:1
Ramyamgaa kuteerana rangavalluladdindi
deenurali gutilona deepamga veligindi
shunyamaina venuvulo oka swaram
kalipi nilipindi
aakuraalu adaviki oka aamani daya chesindi
Charanam:2
Viphalamaina na korkelu velade gummamlo
aashala adugulu vinabadi antalo poyayi
kommallo pakshullaraa gaganamlo mabbullaraa
nadi dochukupotunna navanu aapandi
revu bavurumantondani navaku cheppandi
Telugu Transliteration
పల్లవి:నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది
కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల వచ్చింది
చరణం:1
రమ్యంగా కుటీరాన రంగవల్లులద్దింది
దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది
శూన్యమైన వేణువులో ఒక స్వరం
కలిపి నిలిపింది
ఆకురాలు అడవికి ఒక ఆమని దయ చేసింది
చరణం:2
విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినబడి అంతలో పోయాయి
కొమ్మల్లో పక్షుల్లారా గగనంలో మబ్బుల్లారా
నది దోచుకుపోతున్న నావను ఆపండి
రేవు బావురుమంటోందని నావకు చెప్పండి
Added by