LYRIC

O priya priyaa..naa priyaa priyaa…
yela gaali medalu raalu poola dandalu
needho lokam naadho lokam
ningi nela thaakedhelaaga

O priyaa priyaa…naa priyaa priyaa
o priya priya…naa priyaa priyaa
yela jaali maatalu maasi povu aashalu
ningi nela thaake vela
neeve nenai poyevelaaye
nedu kaadhule repu ledhule
veedu kolidhe…..veedu kolidhe…

Nippulona kaaladhu…. neetilona naanadhu
gaali laaga maaradhu…..prema sathyamu
raacha veeti kannedhi rangu rangu swapnamu
pedha vaadi kantilo prema raktamu
gaganaalu bhuvanaalu veligedhi prematho
jananaalu maranaalu pilichedhi prematho
yenni baadhalochina yeduru ledhu premaku
raaja saasanaalaki longipovu premalu
sawaaluga theesuko o nee prema

O priya priyaa….naa priya priyaa
o priya priyaa….naa priya priyaa

Kaalidhaasu geethiki…..krishna raasaleelaki
pranaya moorthi raadhaki….prema pallavi
aa anaaru aasaki tajmahal shobhaki
pedha vaadi premaki chaavu pallaki
nidhi kanna yedha minna gelipinchu premane
katha kaadhu brathukante bali kaani premane
velli poku nesthma pranamaina bandhama
penchukunna paashame thenchi velli pokumaa
jayinchedi okkate o nee prema

O priya priyaa…naa priya priyaa
o priya priyaa…naa priya priyaa
kaalamanna preyasi theerchamandi le kasi
ningi nela thaake vela
nuvve nenai poye kshanaana
ledhu shaasanam ledhu bandhanam
prema ke jayam premadhe jayam

Telugu Transliteration

ఓ ప్రియా ప్రియా... నా ప్రియా ప్రియా...

ఏల గాలి మేడలూ... రాలు పూల దండలు

నీదో లోకం... నాదో లోకం

నింగీ నేల తాకేదెలాగ!

ఓ ప్రియా ప్రియా... నా ప్రియా ప్రియా...

ఓ ప్రియా ప్రియా... నా ప్రియా ప్రియా...

ఏల గాలి మాటలూ... మాసిపోవు ఆశలూ

నింగీ నేల తాకే వేళ

నీవే నేనై పోయే వేళాయె

నేడు కాదులే... రేపు లేదులే

వీడుకోలిదే... వీడుకోలిదే

చరణం : 1

నిప్పులోన కాలదూ నీటిలోన నానదూ

గాలిలాగ మారదూ ప్రేమ సత్యమూ

రాచవీటి కన్నెదీ రంగు రంగు స్వప్నమూ

పేదవాడి కంటిలో ప్రేమ ర క్తమూ

గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో

జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో

ఎన్ని బాధలొచ్చినా ఎదురులేదు ప్రేమకూ

రాజశాసనాలకీ లొంగిపోవు ప్రేమలూ

సవాలుగా తీసుకో ఓయీ ప్రేమా

ఓ ప్రియా ప్రియా... నా ప్రియా ప్రియా...

ఓ ప్రియా ప్రియా... నా ప్రియా ప్రియా...

చరణం : 2

కాళిదాసు గీతికీ కృష్ణ రాసలీలకీ

ప్రణయమూర్తి రాధకీ ప్రేమపల్లవీ

ఆ అనారు ఆశకీ తాజ్‌మహల్ శోభకీ

పేదవాడి ప్రేమకీ చావు పల్లకీ

నిధి కన్న ఎద మిన్న గెలిపించు ప్రేమనే

కథ కాదు బ్రతుకంటే బలికాని ప్రేమనే

వెళ్ళిపోకు నేస్తమా ప్రాణమైన బంధమా

పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళిపోకుమా

జయించేది ఒక్కటే ఓయీ ప్రేమా

ఓ ప్రియా ప్రియా... నా ప్రియా ప్రియా...

ఓ ప్రియా ప్రియా... నా ప్రియా ప్రియా...

కాలమన్న ప్రేయసీ తీర్చమందిలే కసీ

నింగీ నేల తాకే వేళ నీవే నేనై పోయే క్షణాన

లేదు శాసనం లేదు బంధనం

ప్రేమకే జయం ప్రేమదే జయం

SHARE

VIDEO