LYRIC

Pallavi:

Are khushee khushee  chaestaenae kalugu hushaaru..

Bale bale mogunulae valapu sitaaru            ||are khushee ||

Valapu majaa choopistaa ituraavoyee

Khushee khushee  chaestaenae kalugu hushaaru..

 

Charanam:1

Naato deetaina naayakudu neevaelae

Neeku sariyaina priyuraalini naenaelae            ||naato||

Malle virajaaji manasoo neekaelae

Gulaabi raeku vamti naa sogasoo neekaelae            ||malle||

Amdimchina amdaanni anubhavimchavoy

Vrdhaa chaeyakoy chaejaaraneeyakoy

Idae samayamoy….                    ||are khushee||

 

Charanam:2

Svargam ekkadano laedoyee monagaadaa

Amtaa naalonae vumdoyee chelikaadaa            ||svargam||

Nijaanni telusukuni bhujaalu kalupukuni        ||nijaanni||

Sukhaanni pomdaali o amdagaadaa

Viluvaina jeevitaani anubhavimchavoy

Vrdhaa chaeyakoy chaejaaraneeyakoy

Idae samayamoy….    O o o o o o o        ||are khushee||

Telugu Transliteration

పల్లవి:

అరె ఖుషీ ఖుషీ చేస్తేనే కలుగు హుషారు..
బలె బలె మోగునులే వలపు సితారు ||అరె ఖుషీ ||
వలపు మజా చూపిస్తా ఇటురావోయీ
ఖుషీ ఖుషీ చేస్తేనే కలుగు హుషారు..


చరణం:1

నాతో దీటైన నాయకుడు నీవేలే
నీకు సరియైన ప్రియురాలిని నేనేలే ||నాతో||
మల్లె విరజాజి మనసూ నీకేలే
గులాబి రేకు వంటి నా సొగసూ నీకేలే ||మల్లె||
అందించిన అందాన్ని అనుభవించవోయ్
వృధా చేయకోయ్ చేజారనీయకోయ్
ఇదే సమయమోయ్.... ||అరె ఖుషీ||


చరణం:2

స్వర్గం ఎక్కడనో లేదోయీ మొనగాడా
అంతా నాలోనే వుందోయీ చెలికాడా ||స్వర్గం||
నిజాన్ని తెలుసుకుని భుజాలు కలుపుకుని ||నిజాన్ని||
సుఖాన్ని పొందాలి ఓ అందగాడా
విలువైన జీవితాన్ని అనుభవించవోయ్
వృధా చేయకోయ్ చేజారనీయకోయ్
ఇదే సమయమోయ్.... ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ||అరె ఖుషీ||

Added by

Latha Velpula

SHARE

Comments are off this post