LYRIC
Pallavi:
Mundu telisenaa prabhuu
ee mandiramitulunchenaa
mandamatini neevu vacchu
madhura kshanamedo.. Kaasta //mundu telesena//
Charanam:1
Andamugaa nee kanulaku vindulugaa vaakitane//2//
sundara mandaara kunda sumadalamulu paruvanaa//2//
daari podugunaa tadisina paarijaatamulapai
nee adugula gurutule nilichinaa chaalunu //mundu telisena//
Charanam:2
Bratukantaa eduruchoochu pattuna raane raavu//2/
edura rayani vela vacchi itte maayamoutaavu//2//
kadalaneeka nimushamu nanu vadalipoka nilupaga
nee padamula bandhimpalenu hrudayamu sankela chesi //mundu telisena//
Telugu Transliteration
పల్లవి:ముందు తెలిసెనా ప్రభూ
ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు
మధుర క్షణమేదో.. కాస్త //ముందు తెలిసేనా//
చరణం:1
అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే//2//
సుందర మందార కుంద సుమదళములు పరువనా//2/
దారి పొడుగునా తడిసిన పారిజాతములపై
నీ అడుగుల గురుతులే నిలిచిన చాలును (ముందు తెలిసెనా)
చరణం:2
బ్రతుకంతా ఎదురుచూచు పట్టున రానే రావు//2//
ఎదుర రయని వేళ వచ్చి ఇట్టే మాయమౌతావు//2//
కదలనీక నిముషము నను వదలిపోక నిలుపగ
నీ పదముల బంధింపలేను హృదయము సంకెల చేసి //ముందు తెలిసెన//